Bigg Boss 4 Telugu: సోహైల్, మెహబూబ్‌పై సెటైర్లు.. ఏం ఓవర్ యాక్షన్ గురూ..?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ మూడో వారం మొదలైన తర్వాత చాలా ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఒకరినొకరు కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రోబోలు, మనుషులు అంటూ బిగ్ బాస్ చేస్తున్న హడావిడి బాగానే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 23, 2020, 4:07 PM IST
Bigg Boss 4 Telugu: సోహైల్, మెహబూబ్‌పై సెటైర్లు.. ఏం ఓవర్ యాక్షన్ గురూ..?
సోహైల్ మెహబూబ్ (sohail mehaboob)
  • Share this:
బిగ్ బాస్ మూడో వారం మొదలైన తర్వాత చాలా ఆసక్తికరంగా మారింది. ఏకంగా ఒకరినొకరు కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు ఇచ్చిన టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రోబోలు, మనుషులు అంటూ బిగ్ బాస్ చేస్తున్న హడావిడి బాగానే వర్కవుట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ టాస్కులో కొందరు మాత్రం చాలా ఎక్స్ ట్రాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇద్దర్ని అయితే భలే టార్గెట్ చేసారు ఆడియన్స్. వాళ్లే మెహబూబ్, అరియానా. విచిత్రం ఏంటంటే ఈ సారి ఇద్దరూ నామినేషన్స్‌లో ఉన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory/Instagram)


ఈ వారం బయట పడాలంటే కచ్చితంగా జనాల అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలి. లేదంటే మాత్రం కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. అందుకే వీలైనంత వరకు ఫోకస్ అంతా తమవైపు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దానికోసం ఇప్పుడు వాళ్ల ముందున్న ఒకేదారి ఓవర్ యాక్షన్ చేయడం.. అదే చేస్తున్నారు కూడా. టాస్కులో భాగంగా అరియానా పూర్తిగా ఓన్ గేమ్ ఆడేస్తుంది. అభిజీత్ లాంటి వాళ్లంతా కలిసి మరోలా ఆడుతుంటే.. అరియానా మాత్రం సొంతంగా గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది.

బిగ్ బాస్ 4 తెలుగు టీమ్ (bigg boss 4 telugu)
బిగ్ బాస్ 4 తెలుగు టీమ్ (bigg boss 4 telugu)


అడిగితే ఇది నా గేమ్ అంటూ సమాధానం చెప్తుంది. ఇది చూసిన ఆడియన్స్ కూడా బాబోయ్ ఇదేం ఓవర్ యాక్షన్‌రా బాబూ అంటూ తల పట్టుకుంటున్నారు. మరోవైపు మెహబూబ్ కూడా అంతే. ముఖ్యంగా దివిని కిడ్నాప్ చేసిన తర్వాత మెహబూబ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మరోలా ఉన్నాయి. దమ్ముంటే నన్ను తీసుకెళ్లండ్రా.. ఆడపిల్లను కాదంటూ మనోడు డైలాగులు కొట్టాడు. దాంతో పాటు బయటికి వచ్చి తల పట్టుకుని ఆ.. అంటూ అరుస్తూ బాగా ఓవర్ యాక్షన్ చేసాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ ప్రోమో విడుదలైన తర్వాత కమెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఈ సోహైల్, మెహబూబ్ గాడి ఓవర్ యాక్షన్ ఏంట్రా బాబూ చూడలేకపోతున్నామంటూ రెచ్చిపోతున్నారు. దాంతో పాటు అరియానాను కూడా టార్గెట్ చేస్తున్నారు. నామినేషన్స్‌లో ఉన్నంత మాత్రానా ఇంత ఓవర్ యాక్షన్ అవసరం లేదబ్బా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ వీకెండ్ మరోసారి నాగార్జున క్లాస్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 23, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading