Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి..

Bigg Boss 4 Telugu | తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో గా చెప్పుకునే బిగ్ బాస్ నాలుగో సీజన్ రెండో వారం పూర్తి చేసుకోబోతుంది. గత ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో దర్శకుడు సూర్యకిరణ్.. హౌస్ నుంచి ఎలిమినేషన్‌కు గురయ్యాడు. తాజాగా ఈ వారం కరాటే కళ్యాణిని హౌస్ నుంచి బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసాడు.

news18-telugu
Updated: September 19, 2020, 10:50 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి..
కరాటే కళ్యాణి (Twitter/Photo)
  • Share this:
Bigg Boss 4 Telugu | తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో గా చెప్పుకునే బిగ్ బాస్ నాలుగో సీజన్ రెండో వారం పూర్తి చేసుకోబోతుంది. గత ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియలో దర్శకుడు సూర్యకిరణ్.. హౌస్ నుంచి ఎలిమినేషన్‌కు గురయ్యాడు. తాజాగా ఈ వారం కరాటే కళ్యాణిని హౌస్ నుంచి బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసాడు. అయితే తొలి వారంలో నామినేషన్స్ ఎదుర్కొన్న హౌస్ మేట్స్ ఏడుగురిలో అభిజిత్, సుజాత, గంగవ్వ, దివి, అఖిల్, మహబూబ్  సేఫ్ అవ్వగా సూర్య కిరణ్ మాత్రమే బుక్ అయిపోయాడు. అందరికన్నా చాలా తక్కువ ఓట్లతో సూర్యకిరణ్ బయటపడ్డాడు. అయితే సూర్యకిరణ్ బయటకు వెళ్లడం వెనుక అతడి స్వయంకృతపరాధమే ఉందనే మాట మొదటి నుంచి వినిపించింది. స్వతహాగా దర్శకుడు అయిన సూర్యకిరణ్ అందరినీ తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూశాడని అందరి హౌస్ మేట్స్ కంప్లైంట్ గా ఉంది. అయితే సరిగ్గా అలాంటి విమర్శలను ఎదుర్కొంటున్న మరో కంటెస్టెంట్ కరాటే కళ్యాటినే అని నెట్టింట కోడై కూసింది. నెటిజన్లు అనుకున్నట్టే.. ఈ శనివారం కరాటే కళ్యాణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పటి వరకు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వీళ్లు.. సినీ ఇండస్ట్రీతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారే. అందులో ఒకరు దర్శకుడు అయితే.. ఇంకొకరు నటి. మొత్తంగా బిగ్‌బాస్ సినీ ఇండస్ట్రీ వ్యక్తులకు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరాటే కళ్యాణి (Karate Kalyani)
కరాటే కళ్యాణి (Karate Kalyani)


కరాటే కళ్యాణి ప్రోగ్రాం హోస్ట్ నాగార్జున ముందే కొన్ని విషయాల్లో ఖరాకండిగా చెప్పింది. తాను ఎవరిని నమ్మను అని, తనను తానే నమ్ముకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇతర హౌస్ మేట్స్ విషయంలో కూడా కరాటే కళ్యాణి సాఫ్ట్ గా కాకుండా కాస్త హార్ష్ గా వ్యవహరిస్తోందనే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమె బడాయే ఈమె కొంప ముంచిదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 19, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading