Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి దేత్తడి హారిక ఎలిమినేషన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4 రసవత్తరంగా మారింది. గేమ్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని.. సేఫ్ గేమ్ ఆడుతున్నారని శనివారం హౌస్ మేట్స్‌కు నాగ్ క్లాస్ పీకాడు. ఈ రెండో వీకెండ్‌లో నాగార్జున దేత్తడి నాగార్జునకు ఎలిమినేషన్ చేసారు.

news18-telugu
Updated: September 20, 2020, 10:37 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ హౌస్ నుంచి దేత్తడి హారిక ఎలిమినేషన్.. ఇంతకీ ఏం జరిగిందంటే..
దేత్తడి హారిక (Instagram/Photo)
  • Share this:
Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4 రసవత్తరంగా మారింది. గేమ్‌ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని.. సేఫ్ గేమ్ ఆడుతున్నారని శనివారం హౌస్ మేట్స్‌కు నాగ్ క్లాస్ పీకాడు.  సేఫ్‌ గేమ్‌కు స్థానం లేకుండా ఓ టాస్క్ ద్వారా ఇంటి సభ్యుల మధ్య చిచ్చుపెట్టారు. ఇంట్లో ఎవరు హీరో, ఎవరు జీరో చెప్పాలని టాస్క్ ఇచ్చారు. ఎక్కువ మంది గంగవ్వ, అమ్మ రాజశేఖర్‌లను హీరో చేయగా.. కుమార్ సాయి, కరాటే కళ్యాణిని జీరో చేశారు. ఇంటిలో అమ్మ రాజశేఖర్ జోకులు శృతి మించుతున్నాయని.. ఓ టాస్క్ విషయంలో దివిని తాకాడని.. యాంకర్ లాస్య కామెంట్ చేయడంతో.. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను ఇంటి నుంచి ఎలిమినేట్ చేయండి సార్.. వెళ్లిపోతానని మోకాళ్లపై కూర్చొని నాగార్జునను రిక్వెస్ట్ చేశాడు. అమ్మరాజశేఖర్‌ను చూసి మిగతా సభ్యులు కూడా కంటి తడిపెట్టుకున్నారు.

dethadi Harika, Bigg boss 4 telugu, bigg boss update, బిగ్ బాస్, బిగ్ బాస్ తెలుగు, దేత్తడి హారిక,
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో దేత్తడి హారిక


ఈ టాస్క్ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియపై డిస్కషన్ జరిగింది. ముందుగా గంగవ్వ సేవ్ అయినట్లు ప్రకటించిన నాగార్జున.. అనంతరం ఇంటి సభ్యులందరికీ షాకిచ్చారు. ఈ వారం ఒక్కరు కాదు.. ఇద్దరు వెళ్లిపోతారు.. డబుల్ ఎలిమినేషన్ అని బాంబు పేల్చారు. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఇంటి నుంచి వెళ్లిపోతారని ప్రకటించారు. అనంతరం కరాటే కల్యాణి ఎలిమినేట్ శనివారం ప్రకటించాడు. తాజాగా ఈ రోజు కూడా అదే డ్రామా కంటిన్యూ అయింది. చివరకు దేత్తడి హారిక హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు. కానీ అంతలోనే ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. దీంతో హారిక ఊపిరి పీల్చుకుంది. ఈ వారం ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తానని చెప్పిన నాగ్.. చివరకు ఒక్క కరాటే కళ్యాణి ఎలిమినేషన్‌‌తోనే సరిపెట్టుకున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 10:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading