HOME »NEWS »MOVIE »bigg boss 4 telugu pawan kalyan fans targeting devi nagavalli pk

Bigg Boss 4 Telugu: దేవి నాగవల్లిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..

Bigg Boss 4 Telugu: దేవి నాగవల్లిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్..
పవన్ కళ్యాణ్ దేవి నాగవల్లి (pawan kalyan devi)

Bigg Boss 4 Devi Nagavalli: బిగ్ బాస్ సీజన్ మూడు నాలుగు రోజులుగా చాలా జోరుగా జరుగుతుంది. రోజురోజుకీ తన రేంజ్ కూడా పెంచుతున్నాడు బిగ్ బాస్ కూడా. అలాగే సీజన్‌లోనే తొలి టాస్క్ కూడా ఇచ్చాడు.

  • Share this:
బిగ్ బాస్ సీజన్ మూడు నాలుగు రోజులుగా చాలా జోరుగా జరుగుతుంది. రోజురోజుకీ తన రేంజ్ కూడా పెంచుతున్నాడు బిగ్ బాస్ కూడా. అలాగే సీజన్‌లోనే తొలి టాస్క్ కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఇంట్లో అందరికీ భలే టాస్కులు అయితే ఇస్తున్నాడు బిగ్ బాస్. అయితే హౌజ్‌లో ఎంత మంది ఉన్నా అందరి ఫోకస్ మాత్రం గంగవ్వపైనే ఉంది. ఆమె ఏం చేస్తుంది.. ఎలా చేస్తుందనేది అంతా చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ కంటెస్టెంట్‌పై మాత్రం సోషల్ మీడియాలో వ్యతిరేకత వస్తుంది.
పవన్ కళ్యాణ్ దేవి నాగవల్లి (pawan kalyan devi)

ఆమె ఎవరో కాదు.. దేవి నాగవల్లి. ప్రతీ సీజన్‌లో కూడా కచ్చితంగా ఓ టీవీ 9 ఉద్యోగి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రెండో సీజన్ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. అప్పుడు దీప్తి నల్లమోతును తీసుకున్నారు.. ఆ తర్వాత మూడో సీజన్ కోసం జాఫర్ వచ్చాడు.. ఇప్పుడు దేవి నాగవల్లి వచ్చింది. అయితే ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఈమెపై వస్తుంది. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దేవిపై పగ బట్టారు. ఆమెను ఎలాగైనా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేయండి అంటూ ఏకంగా కాంటెస్టులు రన్ చేస్తున్నారు.


పవన్ కళ్యాణ్ దేవి నాగవల్లి (pawan kalyan devi)
పవన్ కళ్యాణ్ దేవి నాగవల్లి (pawan kalyan devi)

పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈమెను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. ఛానెల్‌లో ఉన్నపుడు పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాన్ని ఇప్పుడు తీర్చుకుంటున్నారు అభిమానులు. నువ్వు నామినేషన్‌కు వస్తే ఇంటికి మేం పంపిస్తామంటూ ఆమెపై ట్రోల్ మొదలు పెట్టారు. మరోవైపు సోషల్ మీడియా సపోర్ట్ అంతా గంగవ్వకే ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే దేవి నాగవల్లి కానీ నామినేషన్‌లోకి వస్తే ఇంటికి పంపిస్తారేమో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:September 11, 2020, 14:54 IST

टॉप स्टोरीज