బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు ఈయన. పెద్దాయన చర్యలు నిజంగానే ఊహాతీతం. ఇప్పుడు కూడా ఇదే చేసాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే ఇంట్లో ఎలాంటి రచ్చకు తెరతీసాడో అర్థమవుతుంది. దివాళీ రావడంతో స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసాడు బిగ్ బాస్. అందులో భాగంగానే ఇంటి సభ్యులకు ఓ టాస్క్ ఇచ్చాడు. ప్రస్తుతం అఖిల్ సీక్రేట్ రూమ్‌లో ఉన్నాడు. దాంతో మిగిలిన వాళ్లకు ఇంటి నుంచి బహుమతులు వచ్చాయి. వాటిని వాళ్లకు ఇవ్వడానికి బిగ్ బాస్ స్పెసల్ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే ఓ రోజంతా నవ్వకుండా ఉండటం.. మిగిలిన వాళ్లు ఎంత ప్రయత్నించినా కూడా నవ్వకుండా ఉండటమే వాళ్ల టాస్క్. అది పూర్తి చేస్తే బహుమతులు అందుతాయి. లేదంటే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతాయి. ఇప్పటికే లెటర్స్ విషయంలో కూడా అవినాష్, అరియానకు రాకుండా చింపి పంపించాడు అఖిల్. ఇప్పుడు అఖిల్ చేతుల్లో కూడా ఏం లేదు. నేరుగా బిగ్ బాస్ ఈ టాస్క్ ఇస్తున్నాడు.

బిగ్ బాస్ 4 తెలుగు
అందులో భాగంగానే అవినాష్ ఇంటి సభ్యులను బాగానే నవ్వించడానికి ప్రయత్నించాడు. సోహెల్, లాస్య వెంటనే నవ్వేసారు కూడా. మరోవైపు సోహెల్ కూడా జోకర్ గెటప్ వేసుకుని వచ్చిన తర్వాత లాస్య, మెహబూబ్ నవ్వేసారు. అభిజీత్‌పై పంచ్ వేసి మోనాల్‌ను నవ్వించాడు సోహెల్. ఇదిలా జరుగుతుండగానే బిగ్ బాస్ ఈయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సోహెల్ ఏందీ నీ పంచాయతి.. కథ ఎట్లుంది అంటూ కామెడీ చేసాడు.
వెంటనే అవినాష్‌ను పిలిచి మీ తెలుగు బాగుంటుంది.. మీరు తెలుగులో నవ్వండి అంటూ చెప్పుకొచ్చాడు. అలా బిగ్ బాస్ కూడా టాస్క్ చెడగొట్టే పని మొదలు పెట్టాడు. చివరికి అంతా నవ్వేసరికి మీరు టాస్కులో ఓడిపోయారు అంటూ చావుకబురు చల్లగా చెప్పాడు బిగ్ బాస్. మొత్తానికి దివాళీ స్పెషల్ ఎపిసోడ్ మాత్రం నవ్వు లేకుండా.. నవ్వలేకుండా ప్లాన్ చేసాడు బిగ్ బాస్.
Published by:Praveen Kumar Vadla
First published:November 13, 2020, 20:19 IST