Home /News /movies /

BIGG BOSS 4 TELUGU NEW PROMO GOES VIRAL AND ALL FINALISTS GETTING TEARS IN EYES PK

Bigg Boss 4 Telugu: ఆ వీడియో చూసి కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ ఫైనలిస్టులు..

బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు మరో మూడు రోజుల్లో ముగిసిపోతుంది. దాంతో గొడవలు, పీకులాటలు ఇప్పుడు కనిపించడం లేదు. హాయిగా ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా పండగ చేసుకోవాలని ఫిక్సైపోయారు కంటెస్టెంట్స్.

బిగ్ బాస్ 4 తెలుగు మరో మూడు రోజుల్లో ముగిసిపోతుంది. దాంతో గొడవలు, పీకులాటలు ఇప్పుడు కనిపించడం లేదు. హాయిగా ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా పండగ చేసుకోవాలని ఫిక్సైపోయారు కంటెస్టెంట్స్. అందుకే ఎవరికి వాళ్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో ఉన్న ప్రతీక్షణం పండగలా చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇంట్లో నవ్వులు మరీ ఎక్కువైపోయాయి అందుకే ఏడిపించాలనుకున్నాడో ఏమో కానీ బిగ్ బాస్ అనుకున్నంత పని చేసాడు. మరోసారి అందర్నీ ఏడిపించేసాడు. అయితే అవి కన్నీరు కాదు.. ఆనంద బాష్పాలు. బిగ్ బాస్ 4 తెలుగు మొదలై 100 రోజులు పూర్తి కావడంతో ఇప్పటి వరకు వాళ్ల జర్నీ ఎలా ఉందో ఒక్కసారి తిరిగి వాళ్లకే చూపించాడు బిగ్ బాస్. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైందిప్పుడు. అది చూసిన తర్వాత తెలియకుండానే అందరి కళ్లలో నీళ్లు వచ్చేసాయి. అభిజీత్ అయితే మరీ ఎమోషనల్ అయిపోయాడు. తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డిసిషన్ ఇదే అంటూ చెప్పేసాడు. దాంతో పాటు హారిక రేపు నేను ఉన్నా లేకపోయినా నా జీవితంలో మాత్రం బిగ్ బాస్ అలా ఉండిపోతుంది.. ఇదో తీపి జ్ఞాపకం అంటూ కన్నీరు పెట్టుకుంది.
bigg boss 4 winner,bigg boss 4 winner abijeet,bigg boss 4 telugu latest promo,bigg boss telugu 4 latest promo,bigg boss 4 telugu today promo,bigg boss telugu 4 today promo,bigg boss 4 telugu promo latest today,bigg boss 4 latest promo,bigg boss 4 telugu trolls,bigg boss 4 telugu unseen,బిగ్ బాస్ 4 విన్నర్,బిగ్ బాస్ 4 తెలుగు లేటెస్ట్ ప్రోమో,కన్నీరు పెట్టుకున్న బిగ్ బాస్ ఫైనలిస్టులు
బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

సోహెల్ ఇంకాస్త ఎమోషనల్ అయ్యాడు. అక్కడ వీడియో చూస్తుండగానే మనోడు ఏడ్చేసాడు. థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ నమస్కారాలు చేసాడు. అరియానా కూడా తన జర్నీ చూసుకుని మురిసిపోయింది. మధ్యలో ఇంట్లో తాను చేసిన రచ్చ చూసుకుని నవ్వుకుంది. నాకు హృదయం లేకపోతే ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటూ అరియానా అరుపులు ఇప్పటికీ మార్మోగిపోతున్నాయి. అది చూసుకున్నపుడు ఏడ్చేసింది ఈ బ్యూటీ.

చివరగా అఖిల్ కూడా తన ప్రయాణం చూసి ఆనందపడ్డాడు. ఎప్పటికీ ఈ ఫీలింగ్ తాను మరిచిపోలేనని.. బిగ్ బాస్ అనేది తనకు ఫరెవర్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నాడు అఖిల్ సార్థక్. మొత్తానికి గుర్తుకొస్తున్నాయి అంటూ వాళ్ల జర్నీని వాళ్లకే చూపించి ఏడిపించేసాడు బిగ్ బాస్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు