• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU NETIZENS GETS FIRES ON SHOW MAKERS AFTER THE ELIMINATION OF KUMAR SAI PK

Bigg Boss 4 Telugu: మీకు నచ్చినోళ్లను సేవ్ చేయడానికి ఓట్లు వేయడం ఎందుకు బిగ్ బాస్..?

Bigg Boss 4 Telugu: మీకు నచ్చినోళ్లను సేవ్ చేయడానికి ఓట్లు వేయడం ఎందుకు బిగ్ బాస్..?

బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)

Bigg Boss 4 Telugu: ఆరో వారం కుమార్ సాయి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్నలు చెలరేగుతున్నాయి. నిజానికి ఈయన ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు.

  • Share this:
ఆరో వారం కుమార్ సాయి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్నలు చెలరేగుతున్నాయి. నిజానికి ఈయన ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. హౌజ్‌లో అదిరిపోయేలా పర్ఫార్మ్ చేస్తూ రోజు రోజుకీ తన గ్రాఫ్ పెంచుకుంటున్న కుమార్ సాయిని కావాలనే ఎలిమినేట్ చేసారనే ఆరోపణలు వస్తున్నాయి. మోనాల్‌ను సేవ్ చేయడానికి కుమార్‌ను బలవంతంగా బయటికి తోసేసారంటూ ప్రచారం జరుగుతున్న వేళ బిగ్ బాస్ ఓటింగ్‌పై చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి. ఎవరెన్ని ఓట్లు వేసినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు తమకు కావాల్సిన వాళ్లను మాత్రమే సేవ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఇదే విమర్శలను కరాటే కళ్యాణితో పాటు దేవి నాగవల్లి చేసారు. వీళ్లు షో నుంచి బయటికి వచ్చిన తర్వాత తమకు ఓట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పుకొచ్చారు. కానీ ఓటింగ్ గురించి చెప్పకుండానే నచ్చనోళ్లను బయటికి పంపించేస్తున్నారని కళ్యాణి ఆరోపించింది. కుమార్ సాయిని కూడా అలాగే పంపించేసారంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.
కుమార్ సాయి (Kumar Sai)
కుమార్ సాయి (Kumar Sai)

మీకు నచ్చినోళ్లను షోలో ఉంచుకోడానికి అయితే ఓట్లు వేయండి అంటూ ఎందుకు తొక్కలో ప్రమోషన్స్ అన్నీ చేస్తున్నారంటూ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. మీ ఆట మీరే ఆడుకోండి.. మీకు కావాల్సిన వాళ్లనే ఇంట్లో పెట్టుకోండి అంటూ ఫైర్ అవుతున్నారు. అఖిల్, మోనాల్ రొమాన్స్ కోసమే ఆమెను ఓట్లు తక్కువ వచ్చినా కూడా సేవ్ చేసారా అంటూ ప్రశ్నలు రేగుతున్నాయి. అసలేం చేస్తుందని మోనాల్‌ను సేవ్ చేసారు.. గ్లామర్ షో చేస్తుందనా అంటూ ప్రశ్నిస్తున్నారు.
బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)
బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)

కచ్చితంగా కుమార్ కంటే మోనాల్‌కు ఓట్లు తక్కువగా వచ్చాయనేది సుస్పష్టమైన విషయమే అంటున్నారు నెటిజన్లు. కానీ వాళ్లకు నచ్చినట్లుగా వ్యవహరించి కంటెంట్ రాదేమో అనుకున్న వాళ్లను బలవంతంగా గెంటేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మూడోవారంలో దేవి.. ఇప్పుడు కుమార్ సాయి ఎలిమినేషన్ దానికి నిదర్శనం అంటున్నారు అభిమానులు. మరి చూడాలిక.. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే జరిగితే బిగ్ బాస్ ఉనికిపైనే ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు