Home /News /movies /

BIGG BOSS 4 TELUGU NAGARJUNA HOST BIGG BOSS STILL NOT BEATEN VANTALAKKA KARTHIKA DEEPAM SERIELS TA

Bigg Boss 4 Telugu: నాగార్జున పరువు తీసేసిన కార్తీక దీపం వంటలక్క.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..

కార్తీక దీపం సీరియల్ ముందు బిగ్‌బాస్ షో విల విల (Twitter/Photo)

కార్తీక దీపం సీరియల్ ముందు బిగ్‌బాస్ షో విల విల (Twitter/Photo)

Bigg Boss 4 Telugu - Nagarjuna-Karthika Deepam  | అక్కినేని నాగార్జున పరవు తీసేసిన కార్తీక దీపం వంటలక్క. వివరాల్లోకి వెళితే.. 

    Bigg Boss 4 Telugu - Nagarjuna-Karthika Deepam  | అక్కినేని నాగార్జున పరవు తీసేసిన కార్తీక దీపం వంటలక్క. వివరాల్లోకి వెళితే.. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్  సీజన్ 4‌కు ఈ వారంతో శుభం కార్డు పడనుంది. సీజన్‌ 4లో  ఈ వారం 15 వారంలోకి అడుగుపెట్టింది. 14వ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఇంటినుంచి మోనాల్ గజ్జర్ వెళ్లిపోయింది. మొత్తంగా ఈ వారం బిగ్‌బాస్ విన్నర్‌గా ఎవరు నిలవనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఫైనల్‌లో అఖిల్, సొహైల్, అభిజిత్, హారిక, అరియానా మాత్రమే మిగిలిఉన్నారు. ఈ సారి కూడా బిగ్‌బాస్  టైటిల్  మేల్ కంటెస్టెంట్స్‌కు దక్కుతుందా...లేకపోలే.. హారిక, అరియానాలలో ఎవరినైనా వరిస్తుందా అనేది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మూడు సీజన్స్‌లలో మగవాళ్లు మాత్రమే విన్ అవుతూ వస్తున్నారు.

    ఐతే.. ఎన్నో అంచనాలతో కరోనా సంక్షోభంలో ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 4 కూడా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ ఈ సీజన్‌లో బిగ్‌బాస్ షో మాత్రం కార్తీక దీపం వంటలక్కను బీట్ చేయలేక చతికిలబడిపోతున్నాడు. ఇప్పటికే బిగ్‌బాస్ ఫైనల్స్‌కు చేరువైన ఈ జోష్ మాత్రం టీఆర్పీ రేటింగ్స్‌లో కనబడలేదు. ఈ ఫైనల్‌లో ఎవరు విజేతలుగా నిలుస్తారనేది ఆసక్తికరమైన అంశమే కానీ.. గత వారం టీఆర్పీ చూస్తే... బిగ్‌బాస్ షో అసలు వంటలక్క దరిదాపుల్లో కూడా లేడు.

    Bigg Boss 4 Telugu Nagarjuna host bigg boss programme Poor TRP Rating Compare to Karthika Deepam and other seriels,Bigg Boss 4,Bigg Boss 4 low TRP Ratings,bigg boss karthika deepam,karthika no 1 position,bigg boss 4 Telugu,Nagarjuna Akkineni,Nagarjuna Quit Bigg boss show,Nagarjuna trolled by netizens,Nagarjuna Twitter,Nagarjuna not interested to continue to bigg boss show,tollywood,Telugu cinema,నాగార్జున,నాగార్జున అక్కినేని,బిగ్‌బాస్ షో,బిగ్‌బాస్ షోకు నాగార్జున గుడ్ బై,బిగ్‌బాస్ షోకు నాగార్జున గుడ్ బై,బిగ్‌బాస్ షోకు నాగార్జున గుడ్ బై,బిగ్‌బాస్ లో టీఆర్పీ రేటింగ్
    బిగ్‌బాస్ 4 (Twitter/Photo)


    ఈ వారం ప్రకటించిన టీఆర్పీ రేటింగ్స్‌లో టాప్‌5లో అన్ని స్టార్ మాలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అందులో బిగ్‌బాస్ 4 ప్రోగ్రామ్‌ను  ఎక్కడ కనబడటం లేదు. దీన్ని బట్టి ఈ షోకు ఫ్యామిలీ లేడీస్ చూడటం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఓవైపు కొన్ని ఛానెల్స్ బిగ్‌బాస్ విజేతగా ఎవరు నిలుస్తానే దానిపై డిస్కషన్ నడుస్తుంటే.. ఈ టీర్పీ రేటింగ్స్ మాత్రం ఘోరంగా ఉండటంతో నాగార్జునతోొ పాటు బిగ్‌బాస్ నిర్వాహకులు ఒకింత తలలు పట్టుకుంటున్నారు. మరి ఫైనల్‌లో అయినా.. బిగ్‌బాస్ .. కార్తీక దీపం సీరియల్‌ను బీట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bigg Boss 4 Telugu, Karthika deepam, Nagarjuna Akkineni, Premi Viswanath, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు