Bigg Boss 4 Telugu: ఆ విషయంలో బిగ్‌బాస్‌కు ఘోర అవమానం.. షాక్‌లో ఫ్యాన్స్ ..

Bigg Boss 4 Telugu | తెలుగులో బిగ్‌బాస్ షో నాల్గో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తి చేసుకోబోతుంది. కోవిడ్ తర్వాత అన్ని భాషల్లో కంటే ముందుగా తెలుగులోనే బిగ్‌బాస్ షో  మొదలైంది. తాజాగా బిగ్‌బాస్‌కు ఘోర అవమానం జరిగింది.

news18-telugu
Updated: October 9, 2020, 6:20 PM IST
Bigg Boss 4 Telugu: ఆ విషయంలో బిగ్‌బాస్‌కు ఘోర అవమానం.. షాక్‌లో ఫ్యాన్స్ ..
బిగ్‌బాస్ 4 (Twitter/Photo)
  • Share this:
Bigg Boss 4 Telugu | తెలుగులో బిగ్‌బాస్ షో నాల్గో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తి చేసుకోబోతుంది. కోవిడ్ తర్వాత అన్ని భాషల్లో కంటే ముందుగా తెలుగులోనే బిగ్‌బాస్ షో  మొదలైంది. రీసెంట్‌గా హిందీతో పాటు తమిళంలో  బిగ్‌బాస్ షో  ప్రారంభమైంది.  బిగ్‌బాస్  సీజన్ 4 ప్రారంభ ఎపిసోడ్‌కు మాత్రం అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత కూడా బిగ్‌బాస్ షో  ప్రతి వారం ఏదో పర్వాలేదనట్టు సాగుతోంది. మొదటి మూడు సీజన్స్‌తో పోలిస్తే.. నాల్గో సీజన్‌లో మాత్రం అంతగా  తెలిసిన ముఖాలు ఎవరు లేకపోవడంతో ప్రేక్షకులు  కూడా ఈ షోను  గతంలో లాగా అంతగా ఇంట్రెస్ట్‌గా చూడటం లేదనేది టాక్. దీనికి నిదర్శనం తాజాగా ప్రకటించిన టీఆర్పీ రేటింగ్స్. ఈ వారం ప్రకటించిన టీఆర్పీ రేటింగ్స్‌లో కూడా టాప్5లో అన్ని స్టార్ మా ప్రోగ్రామ్స్ మంచి రేటింగ్ సాధించాయి. అందులో ఎక్కడ బిగ్‌బాస్ షో ప్రోగ్రామ్ లేకపోవడం గమనార్హం.

కార్తీక దీపం సీరియల్ ముందు బిగ్‌బాస్ షో విల విల (Twitter/Photo)


ఈ వారం ప్రకటించిన టీఆర్పీలో వంటలక్క ఫేమ్ ‘కార్తీక దీపం’ సీరియల్ ఇప్పటికీ తన జోరును కొనసాగుస్తూనే ఎవరికీ అందనంత ఎత్తులో నెంబర్ వన్ ప్లేస్‌లో  ఉంది. ఆ తర్వాత రెండో ప్లేస్‌లో ‘ఇంటింటి గృహలక్ష్మి’, సీరియల్  తన సత్తా చూపెడతోంది.  ఆ తర్వాత వరుసగా ‘వదినమ్మ’, ‘దేవత’, ‘చెల్లెలు కాపురం’ సీరియల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడో కానీ బిగ్‌బాస్ షో లేదు. మొత్తంగా వీకెండ్‌లో నాగార్జున వచ్చే శని, ఆదివారాల్లో మాత్రం ఏదో టీఆర్పీ పర్వాలేదనిపిస్తున్నట్టు సాగుతుంది. స్టార్ మా టీవీ తెలుగులో బిగ్‌బాస్ వంటి షో లేకుండానే నెంబర్ వన్ పొజిషన్‌లో కొనసాగుతూనే ఉంది. అది కూడా తెలుగులో టాప్ 5 ప్రోగ్రామ్స్ కూడా స్టార్ మాలో ప్రసారమయ్యే సీరియల్సే తమ హవా కొనసాగిస్తున్నాయి.  దీంతో స్టార్ మాకు బిగ్‌బాస్ వల్ల పెద్దగా  టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టు కనపడటం లేదు. మొత్తంగా బిగ్‌బాస్‌ షో ముందుగా స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్‌ రేటింగ్స్ దాటడం కత్తి మీద సాములా తయారైంది. మరోవైపు ఐపీఎల్, ఆపై జబర్ధస్త్ కామెడీ షో కూడా బిగ్‌బాస్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. కార్తీక దీపం సహా మిగతా సీరియల్స్ టీఆర్పీ దూకుడు ముందు బిగ్‌బాస్ షో విలవిల లాడిపోతుందని ఈ టీఆర్పీ రేటింగ్స్ చూస్తే అర్ధమవుతోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 9, 2020, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading