Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4 కోసం నాగార్జున రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Bigg Boss 4 Telugu | కరోనా నేపథ్యంలో ఈ యేడాది బిగ్‌బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యం అయింది. లేట్ అయినా.. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతుంది బిగ్‌బాస్ సీజన్ 4. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ కోసం నాగార్జున ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే..

news18-telugu
Updated: July 30, 2020, 8:29 PM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4 కోసం నాగార్జున రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
బిగ్ బాస్ 4 Photo : Star maa
  • Share this:
కరోనా నేపథ్యంలో ఈ యేడాది బిగ్‌బాస్ సీజన్ 4 కాస్త ఆలస్యం అయింది. లేట్ అయినా.. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతుంది బిగ్‌బాస్ సీజన్ 4. నాగార్జున ఈ నాల్గో సీజన్‌ను మరోసారి హోస్ట్ చేయనున్నాడు. త్వరలోనే నాగార్జునతో కూడిన  ప్రోమోను విడుదల చేయనున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు.  ఈసారి కూడా బిగ్‌బాస్ 4 కోసం అన్పపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా ఓ సెట్‌ను రూపొందించారు. తెలుగులో బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున గ్రాండ్‌గా ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి కంటెస్టెంట్స్‌కు ఆరోగ్య స్టార్ మా యాజమాన్యం స్పెషల్ కేర్ తీసుకోనున్నట్టు సమాచారం.

బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)


ఇక బిగ్‌బాస్ షూటింగ్ చేసే ప్రదేశంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు కంటెస్టెంట్స్‌తో పాటు డైరెక్ట్ ఇంటారాక్షన్ వద్దని చెప్పాడట. నాగార్జున కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఇంటి నుంచి సరాసరి ఆ స్పెషల్ రూమ్‌కు వచ్చి షూటింగ్ చేసి వెళతారట. ఆయన కోసం ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగా 100 రోజులు కాకుండా.. ఈసారి 70 రోజులు ఉండేలా బిగ్‌బాస్ సీజన్‌ 4ను ప్లాన్ చేసారు.   తాజగా ఈ సీజన్ కోసం నాగార్జునకు  స్టార్ మా యాజమాన్యం భారీగానే ముట్ట జెప్పబోతున్నట్టు సమాచారం . మొత్తంగా ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 2.5 కోట్ల వరకు ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 10 వారాలకు గాను.. మొత్తంగా రూ. 50 కోట్ల వరకు నాగార్జునకు పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం. దాంతో పాటు మరో రూ. 10 కోట్లు డాక్టర్లు, ఇతర ఖర్చుల కోసం ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా నాగార్జున  ఒక సినిమా చేసేదానికంటే  బిగ్‌బాస్ ద్వారా బాగానే గిట్టుబాటు అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 30, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading