Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4 పై కీలక అప్‌డేట్.. గెట్ రెడీ అంటున్న నాగార్జున..

news18-telugu
Updated: August 1, 2020, 7:58 AM IST
Bigg Boss 4: బిగ్‌బాస్ సీజన్ 4 పై కీలక అప్‌డేట్.. గెట్ రెడీ అంటున్న నాగార్జున..
బిగ్ బాస్ 4 Photo : Star maa
  • Share this:
కోవిడ్-19  కారణంగా ఈ సారి తెలుగులో బిగ్‌బాస్ సీజన్ 4 ఉంటుందా ఉండదా అని బిగ్‌బాస్ ప్రేమికులు అనుమానాలు వ్యక్తం చేసారు. కానీ వారందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ.. స్టార్ మా బిగ్‌బాస్ 4కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసింది. తాజాగా తెలుగులో నాల్గో సీజన్‌కు సంబంధించి కీలకమైన అడుగు ముందుకు పడింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ను తనదైన చతురతతో ఆకట్టుకున్న నాగార్జున .. ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 4ను హోస్ట్ చేయనున్నాడు. తాజాగా ఆయనపై అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో బిగ్‌బాస్ సీజన్ 4కు సంబంధించిన టీజర్‌ను షూట్ చేసారు. ఈ టీజర్‌ను సోగ్గాడే చిన్నినాయన సినిమాను డైరెక్ట్ చేసిన కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ సెంథిల్ పిక్చరైజ్ చేసారు. త్వరలో నాగార్జునతో కూడిన ప్రోమోను విడుదల చేయనున్నారు.


తెలుగులో బిగ్ బాస్ షో షూటింగ్‌ను ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజున గ్రాండ్‌గా ప్రసారం చేయాలనే ఆలోచనలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్‌కు కరోనా టెస్టులు నిర్వహించి తర్వాత పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత హౌస్‌లో పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సారి కంటెస్టెంట్స్‌కు ఆరోగ్య స్టార్ మా యాజమాన్యం స్పెషల్ కేర్ తీసుకోనున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)
బిగ్ బాస్ 4 (Bigg Boss 4)


బిగ్‌బాస్ షూటింగ్ చేసే ప్రదేశంలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మంది సభ్యులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ షో కోసం నాగార్జుకు ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయనున్నారు. గతంలో లాగా 100 రోజులు కాకుండా.. ఈసారి 70 రోజులు ఉండేలా బిగ్‌బాస్ సీజన్‌ 4ను ప్లాన్ చేసారు.   తాజగా ఈ సీజన్ కోసం నాగార్జునకు  స్టార్ మా యాజమాన్యం భారీగానే ముట్ట జెప్పబోతున్నట్టు సమాచారం . మొత్తంగా ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ. 2.5 కోట్ల వరకు ఛార్జ్ చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా 10 వారాలకు గాను.. మొత్తంగా రూ. 50 కోట్ల వరకు నాగార్జునకు పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం. దాంతో పాటు మరో రూ. 10 కోట్లు డాక్టర్లు, ఇతర ఖర్చుల కోసం ఇవ్వనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 1, 2020, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading