Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ నిర్వాహకులపై నాగార్జున ఓ రేంజ్‌లో ఫైర్.. అలాంటివి చేయెద్దంటూ దమ్కీ..

Bigg Boss 4 Telugu Nagarjuna | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. తెలుగులో నాల్గో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున.. ఇపుడు బిగ్‌బాస్ నిర్వాహకులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి.

news18-telugu
Updated: November 26, 2020, 5:08 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్ నిర్వాహకులపై నాగార్జున ఓ రేంజ్‌లో ఫైర్.. అలాంటివి చేయెద్దంటూ దమ్కీ..
బిగ్ బాస్ 4 నిర్వాహకులపై నాగార్జున ఓ రేంజ్‌లో ఫైర్ (Twitter/Photo)
  • Share this:
Bigg Boss 4 Telugu Nagarjuna | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. తెలుగులో నాల్గో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున.. ఇపుడు బిగ్‌బాస్ నిర్వాహకులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకి వెళితే..  ఎక్కడో విదేశాల్లో పాపులర్ అయిన ఈ గేమ్ షో.. హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఇప్పటికే 13 సీజన్లు కంప్లీట్ చేసుకొని 14 సీజన్ నడుస్తోంది. తెలుగులో మాత్రం మూడు సీజన్లు కంప్లీట్ చేసుకొని నాల్గో సీజన్ నడుస్తోంది. తెలుగులో మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. మూడు సీజన్‌తో పాటు నాల్గో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున బిగ్‌బాస్ రియాలిటీ షో కంటే ముందు  స్టార్ మాలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అందులో తన హోస్టింగ్‌తో అదరగొట్టారు. ఆ తర్వాత చిరంజీవి అదే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌ను చేస్తే అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక బిగ్‌బాస్ మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి అదరగొట్టిన నాగార్జున ఇపుడు నాల్గో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

BiggBoss Telugu 4,BiggBoss 4, bigg boss elimination,bigg boss akhil abhijeeth,bigg boss monal,bigg boss robot task,bigg boss telugu vote,tollywood,బిగ్ బాస్ ఎలిమినేషన్, బిగ్ బాస్ తెలుగు 4, బిగ్ బాస్ మోనాల్, బిగ్ బాస్ అభిజీత్, అఖిల్,బిగ్ బాస్ ఓట్లు
బిగ్ బాస్ లోగో Photo: Twitter


తాజాగా సమాచారం ప్రకారం నాగార్జున.. బిగ్‌బాస్ షో నిర్వాహకులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయినట్టు సమాచారం. ఈ సారి బిగ్‌బాస్ విషయంలో నాగార్జున ఒకింత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఎలిమినేషన్స్‌‌తో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కు సంబంధించిన సమాచారం ముందుగానే లీకైపోతున్నాయి. ఈ లీకులపై నాగార్జున స్టార్ మా నిర్వాహకులపై ఒకింత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ లీకులు గట్రా ఉంటే ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనని స్టార్ మా వాళ్లకు నాగార్జున ఖరాఖండీగా చెప్పినట్టు సమాచారం. ఏమైనా ఇక ముందైనా.. లీకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్టార్ మా నిర్వాహకులను కోరాడట. మరి నాగార్జున విన్నపాన్ని స్టార్ మా నిర్వాహకులు  ఎంత వరకు ఆచరిస్తారనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 26, 2020, 4:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading