Bigg Boss 4 Telugu 8th Week Nominations: మళ్లీ నామినేషన్స్‌లో 'మోనల్' రచ్చ.. నువ్వు ఇంక మారవా..?

Bigg Boss 4 Telugu 8th Week Nominations: బిగ్ బాస్ 4 మొదలై ఏడు వారాలు పూర్తైపోయి.. 8వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం ఎప్పట్లాగే నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. అందులో మరోసారి రచ్చ కూడా కామన్ అయిపోయింది. ప్రతీసారి ఒకరిద్దరు మాత్రం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 26, 2020, 2:40 PM IST
Bigg Boss 4 Telugu 8th Week Nominations: మళ్లీ నామినేషన్స్‌లో 'మోనల్' రచ్చ.. నువ్వు ఇంక మారవా..?
బిగ్ బాస్ 4 మోనాల్ (bigg boss 4 monal)
  • Share this:
బిగ్ బాస్ 4 మొదలై ఏడు వారాలు పూర్తైపోయి.. 8వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారం ఎప్పట్లాగే నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. అందులో మరోసారి రచ్చ కూడా కామన్ అయిపోయింది. ప్రతీసారి ఒకరిద్దరు మాత్రం ఎప్పుడూ నామినేషన్స్‌లో ఉంటారు. ఈ సారి కూడా అదే జరిగింది. అరియానా, మోనాల్, మెహబూబ్ లాంటి వాళ్లు ఈ సారి కూడా నామినేషన్స్‌లోకి వచ్చారు. అయితే ఎప్పట్లాగే మోనాల్ మరోసారి ఏడ్చేసింది. ఈమెకు నర్మద అనే పేరు పెట్టిన తర్వాత కూడా మారట్లేదు. ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూనే ఉంటుంది.. ఇప్పటికీ ఆ అలవాటు మార్చుకోవడం లేదు. ప్రతీసారి మాదిరే ఈ సారి కూడా ఏడుపులతోనే నామినేషన్ పూర్తయింది. అభిజీత్, అఖిల్ మళ్లీ మోనాల్ విషయంలోనే గొడవ పడ్డారు. నామినేషన్ అప్పుడు ఆమె పేరు తీసారు.. దాంతో ఆమె దయచేసి నా పేరు తీయొద్దు అంటూ ఏడ్చేసింది. ఏమైనా సమస్య ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటూ చెప్పుకొచ్చింది మోనాల్. అలా చెప్పి మళ్లీ ఏడ్చేసింది ఈమె. దాంతో సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ కూడా మొదలైపోయింది.

నువ్వు మారవు.. నీ ఏడుపు మారదు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా నామినేషన్ అప్పుడే ఏడవడానికి కారణమేంటి.. సింపతీ కొట్టేయడానికా అంటూ ప్రశ్నిస్తున్నారు. నువ్వెన్ని డ్రామాలు చేసినా కూడా ఈ సారి మాత్రం నీ టికెట్ చిరిగిపోతుంది అంటూ మాస్‌గా కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. మరోవైపు అఖిల్‌తో ప్రేమకథ కారణంగా ప్రతీసారి మోనాల్ సేవ్ అయిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. గత వారం కుమార్ సాయి.. ఈ వారం దివిని అలాగే పంపించేసారని ప్రచారం జరుగుతుంది. మరి 8వ వారం ఎలా ఉండబోతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: October 26, 2020, 2:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading