Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 18, 2020, 5:01 PM IST
అఖిల్ మోనాల్ ముద్దులు (Akhil Monal kiss)
బిగ్ బాస్ షో అనేది ఫ్యామిలీ షోనా కాదా..? ఇలాంటి అనుమానాలు ఇప్పుడెందుకు వస్తున్నాయి అనుకుంటున్నారా..? నాగార్జున ఎప్పుడూ చెప్తూ ఉంటాడు కదా.. మీ ఇంటితో పాటు మా యింటిపై కూడా ఓ కన్నేసి ఉంచండి అని. అలా కన్నేసి ఉంచినపుడు చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. అప్పుడప్పుడూ హద్దులు మీరిన రొమాన్స్ కూడా కళ్లలో పడుతుంది. అయినా ఈ సీరి ఇంట్లో రెండు మూడు జంటలున్నాయి. వాళ్లెప్పుడూ కలిసే ఉంటారు. ఇంట్లో టాస్కులు జరిగినపుడు కూడా ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అందులో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అఖిల్, మోనాల్. ఈ జంట సీజన్ మొదట్లోనే కనెక్ట్ అయిపోయారు. ముందు నుంచి కూడా ఒకరికొకరు అన్నట్లు కలిసిపోయారు. దాంతో అప్పుడప్పుడూ వాళ్ల రొమాన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అది కాస్తా లైన్ దాటినట్లు కనిపిస్తుంది. అది చూస్తున్న ఆడియన్స్‌కు కూడా కనిపిస్తుంది. కొన్నిసార్లు అదిరిపోయే ఎమోషన్స్ చూపిస్తూ నిజంగానే ఫ్యామిలీ షో అనిపిస్తుంది.

బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)
కానీ కొన్నిసార్లు మాత్రం వామ్మో ఇదేం షోరా బాబూ.. ఇంట్లో అందరితో కలిసి చూడాలా వద్దా అనిపిస్తుంది. అంతేకాదు చూడగానే తిట్టేలా ఉంటుంది. అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరిగింది. అసలు విషయం ఏంటంటే నవంబర్ 17న అఖిల్ బర్త్ డే. దాంతో ఇంట్లో గొడవలు అన్నీ మరిచిపోయి హాయిగా అంతా కలిసి అతడి బర్త్ డే సెలబ్రేట్ చేసారు. కేక్ కట్ చేయించారు. మొన్నటికి మొన్న నామినేషన్స్‌లో దారుణంగా టార్గెట్ చేసుకున్న అభిజీత్, అఖిల్ కూడా కలిసిపోయి సెలబ్రేట్ చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా అఖిల్ బర్త్ డే రోజు మోనాల్ మాత్రం ఆయనకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. అఖిల్‌ను పట్టుకుని ముద్దుల వర్షం కురిపించింది.

బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ అఖిల్ (Monal Akhil Bigg Boss 4 Telugu)
బుగ్గలపై కంటిన్యూగా ముద్దులు పెడుతూనే ఉంది. అది చూసి అఖిల్ కూడా షాక్ అయ్యాడు. ఫస్ట్ టైమ్ ఇచ్చావ్ కదా నాకు ముద్దులు నువ్వు అంటూ అడిగేసాడు. ఇలా చేస్తానంటే నాకు రోజు బర్త్ డే వచ్చుంటే బాగుండు అనిపిస్తుంది అనేసాడు. వెంటనే మోనాల్ కూడా సిగ్గు పడుతూ సమాధానమిచ్చింది. బర్త్ డే గిఫ్ట్ తీసుకో.. పండగ చేస్కో అనేసింది. ఈ ఇద్దరి రొమాన్స్ మాత్రం కాస్త మితిమీరినట్లే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు ఇలాంటి ముద్దుల వర్షం కాస్త కంగారు పుట్టిస్తుంది అందరికీ. అది బిగ్ బాస్ కూడా అర్థం చేసుకోవాలి మరి.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 18, 2020, 5:01 PM IST