Bigg Boss 4 Monal: మోనాల్‌ను కాపాడటానికి బిగ్ బాస్ మరో ప్లాన్ వేస్తున్నాడా..?

Bigg Boss 4 Monal: ఒక్కో వారం గడుస్తున్న కొద్దీ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. పైగా ఇప్పటి వరకు వీక్ అనుకున్న వాళ్లంతా ఎలిమినేట్ అయిపోయారు. మధ్యలో దేవి నాగవల్లి మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టెంట్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 7, 2020, 8:53 PM IST
Bigg Boss 4 Monal: మోనాల్‌ను కాపాడటానికి బిగ్ బాస్ మరో ప్లాన్ వేస్తున్నాడా..?
బిగ్ బాస్ 4 మోనాల్ (bigg boss 4 monal)
  • Share this:
ఒక్కో వారం గడుస్తున్న కొద్దీ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారుతుంది. పైగా ఇప్పటి వరకు వీక్ అనుకున్న వాళ్లంతా ఎలిమినేట్ అయిపోయారు. మధ్యలో దేవి నాగవల్లి మాత్రమే స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె ఎలిమినేషన్ మాత్రమే అందరికీ షాక్ ఇచ్చింది. ఇక నోయల్ తన వల్ల కాదంటూ సొంతంగా బయటికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే రియాలిటీ షో మొదలై 9 వారాలు అయిపోయింది. దాంతో ఇప్పట్నుంచి బయటికి వెళ్లే వాళ్లు చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు. అయితే గత మూడు నాలుగు వారాలుగా మోనాల్ పేరు ఎలిమినేషన్ లిస్టులో వినిపిస్తుంది. కానీ ప్రతీసారి సేవ్ అవుతూనే ఉంది. ఒక్కోసారి ఆమెను సేవ్ చేయడానికి కుమార్ సాయి లాంటి మిగిలిన కంటెస్టెంట్స్‌ను కూడా బయటికి పంపించేసారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వారం కూడా నామినేషన్ లిస్టులో మోనాల్ ఉంది. ఆమెతో పాటు అమ్మ రాజశేఖర్, అభిజీత్, హారిక, అవినాష్ ఉన్నారు. అయితే మొన్న వాళ్లను సేవ్ చేయడానికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.
bigg boss 4 telugu,bigg boss 4 telugu monal gajjar,bigg boss 4 telugu monal gajjar saved,bigg boss 4 telugu monal gajjar immunity,bigg boss 4 telugu monal gajjar avinash saved,bigg boss 4 telugu monal gajjar eliminated,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ సేవ్,అవినాష్ అభిజీత్ హారిక నామినేషన్
అవినాష్ మోనాల్ (Avinash Monal)


అందులో అభిజీత్, హారిక ఓడిపోయారు. అవినాష్, మోనాల్ మాత్రమే మిగిలిపోయారు. అమ్మ రాజశేఖర్‌ను మాత్రం వద్దని నాగార్జున చెప్పాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ సేవ్ కావడానికి మరో ఆప్షన్ కూడా ఇచ్చాడు నాగార్జున. మోనాల్, అవినాష్‌ను కాపాడటానికి ఈ సారి ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చాడు నాగార్జున. వాళ్లిద్దరిలో ఎవరు ఉండాలనుకుంటే వాళ్లపై తమ యిష్టాన్ని చూపించాలని చెప్పాడు నాగ్. దాని కోసం ఓ పెద్ద బుట్ట తీసుకొచ్చి.. అందులో తమకు యిష్టమైన వాటిని త్యాగం చేయాలని చెప్పాడు. ఎవరి బుట్ట నిండి ఎక్కువ బరువు ఉంటుందో వాళ్లు సేవ్ అయిపోతారని చెప్పాడు.

దాంతో మోనాల్, అవినాష్ బుట్టల కోసం బాగానే త్యాగం చేసారు ఇంటి సభ్యులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే మోనాల్ ఈజీగా సేవ్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే మోనాల్‌కు అఖిల్, అభిజీత్, హారిక, అమ్మ రాజశేఖర్ సపోర్ట్ ఉంది. మరోవైపు అవినాష్‌కు అరియానా, సోహైల్, మెహబూబ్ ఉన్నారు. కచ్చితంగా మోనాల్ అయితే సేవ్ కావడం ఖాయం అనిపిస్తుంది. మరోవైపు అవినాష్ మాత్రం ఈ రేసులో వెనకబడ్డట్లు తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే మోనాల్ కోసం బిగ్ బాస్ మరో ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: November 7, 2020, 8:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading