Bigg Boss 4 Monal Gajjar: మిస్ మోనాల్ కోసం మిషన్ గుజరాత్.. బిగ్ బాస్‌లో ఆసక్తికరమైన నిజాలు..

Bigg Boss 4 Monal Gajjar: ఇప్పుడు ఇదే జరుగుతుంది కూడా. ఎందుకంటే అంతా ముందు నుంచి అనుకున్నదే జరిగింది.. మోనాల్ గజ్జర్ మరో వారం కూడా సేవ్ అయిపోయింది. 12వ వారం నామినేషన్స్‌లోకి చాలా విచిత్రంగా వచ్చిన మోనాల్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 28, 2020, 10:55 PM IST
Bigg Boss 4 Monal Gajjar: మిస్ మోనాల్ కోసం మిషన్ గుజరాత్.. బిగ్ బాస్‌లో ఆసక్తికరమైన నిజాలు..
మోనాల్ గజ్జర్ (Monal Gajjar)
  • Share this:
ఇప్పుడు ఇదే జరుగుతుంది కూడా. ఎందుకంటే అంతా ముందు నుంచి అనుకున్నదే జరిగింది.. మోనాల్ గజ్జర్ మరో వారం కూడా సేవ్ అయిపోయింది. 12వ వారం నామినేషన్స్‌లోకి చాలా విచిత్రంగా వచ్చిన మోనాల్.. అందరికంటే ముందు సేవ్ అయిపోయింది. అఖిల్ సార్థక్ కంటే ముందుగానే మోనాల్ సేఫ్ జోన్‌కు రావడం నిజంగానే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తెలుగులో మోనాల్‌ను అంతగా సేవ్ చేయడానికి ఎవరున్నారబ్బా అంటూ అంతా తలలు పట్టుకుంటున్నారు. మోనాల్ విషయంలో బిగ్ బాస్ ఏదో మతలబు చేస్తున్నాడు.. ఆమెను కావాలనే సేవ్ చేస్తున్నారనే ప్రచారం చాలా రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. గ్లామర్ షో చేస్తుంది.. అభిజీత్, అఖిల్ మధ్య చిచ్చు పెడుతుంది.. అందుకే కావాల్సినంత కంటెంట్ వస్తుంది కాబట్టి మోనాల్ అలా సేవ్ అయిపోతుందనే వాళ్లు కూడా లేకపోలేదు. కానీ వారాలు పెరుగుతున్న కొద్దీ కూడా మోనాల్ అలా సేవ్ అవుతుండటం విమర్శలకు కూడా తావిచ్చింది. అప్పట్లో ఈమెను సేవ్ చేయడం కోసం కుమార్ సాయిని ఎలిమినేట్ చేసారని ప్రచారం భారీగానే జరిగింది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu monal gajjar,bigg boss 4 telugu monal gajjar saved,bigg boss 4 telugu monal gajjar mission gujarat,bigg boss 4 telugu monal gajjar saved 12th week,bigg boss 4 telugu monal gajjar gujarat votes,telugu cinema,bigg boss 4 telugu monal gajjar akhil saved,మోనాల్ గజ్జర్ సేవ్,బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ కోసం గుజరాత్ నుంచి ఓట్లు
కుమార్ సాయి పంపాన (kumar sai pampana)


ఇదిలా ఉంటే 12వ వారం సేవ్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. అయితే మోనాల్ గజ్జర్ ప్రతీవారం ఇలా సేవ్ అవ్వడం వెనక మరో పెద్ద మిషన్ కూడా జరుగుతుంది. అదే మిషన్ గుజరాత్.. అర్థం కాలేదు కదా. మోనాల్ తెలుగమ్మాయి కాదు.. గుజరాత్ నుంచి వచ్చింది. ఈమెకు అక్కడ బాగానే గుర్తింపు ఉంది. పైగా గుజరాతీలో కొన్ని సినిమాలు కూడా చేసింది మోనాల్. ఇప్పుడు ఈమె తెలుగు బిగ్ బాస్‌కు వచ్చిందని తెలుసుకుని అక్కడి నుంచి అభిమానులు ఈమెకు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతీవారం మోనాల్‌కు పడుతున్న ఓట్లలో 80 శాతం గుజరాత్ నుంచి వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
bigg boss 4 telugu,bigg boss 4 telugu monal gajjar,bigg boss 4 telugu monal gajjar saved,bigg boss 4 telugu monal gajjar mission gujarat,bigg boss 4 telugu monal gajjar saved 12th week,bigg boss 4 telugu monal gajjar gujarat votes,telugu cinema,bigg boss 4 telugu monal gajjar akhil saved,మోనాల్ గజ్జర్ సేవ్,బిగ్ బాస్ 4 తెలుగు మోనాల్ కోసం గుజరాత్ నుంచి ఓట్లు
అఖిల్ మోనాల్ Photo : Star maa

ఓటింగ్ అందరికీ సమానంగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి ఎవరైనా ఓట్స్ చేయొచ్చు. మోనాల్ విషయంలో మిషన్ గుజరాత్ బాగా పని చేస్తుంది. అంతేకాదు అక్కడి మీడియాలో కూడా మోనాల్ గజ్జర్ బిగ్ బాస్‌లో ఉన్న సంగతి ప్రచారం చేస్తున్నారు. ఈమెకు ఓట్ చేయాలని ప్రమోట్ చేస్తున్నారు. అందుకే ప్రతీవారం మోనాల్ గజ్జర్ సేవ్ అవుతూ వస్తుంది. ఈ వారం కూడా అందరికంటే ముందు మోనాల్ సేవ్ కావడానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ అహ్మదాబాద్ అమ్మాయి ఇలాగే దూసుకుపోతే టాప్ 2కు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 28, 2020, 10:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading