Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 21, 2020, 8:09 PM IST
అభిజీత్ నాగార్జున మోనాల్ తల్లి (Abijeet Nagarjuna Monal)
బిగ్ బాస్ 4 తెలుగులో మరో వీకెండ్ వచ్చేసింది. దాంతో మరొకరు వెళ్లే సమయం దగ్గరికి వచ్చింది. అయితే వీకెండ్ వచ్చినపుడు ఎలిమినేషన్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ప్లాన్ చేస్తుంటాడు బిగ్ బాస్. ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈయన. ఈ వారం ఇంట్లోకి కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు వచ్చారు. వచ్చి వాళ్లకు కావాల్సిన విషయాలు పంచుకున్నారు. అలాగే మిగిలిన వాళ్లతో కూడా బాగానే కనెక్ట్ అయ్యారు. దాంతో పాత గొడవలు అన్నీ మరిచిపోయి హాయిగా ఎంజాయ్ చేసారు. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో కూడా నాగార్జున మరోసారి ఇంటి సభ్యులను తీసుకొచ్చాడు. అప్పుడు రాని వాళ్లకు ఇప్పుడు అవకాశం వచ్చింది. అందులో భాగంగానే లాస్య అమ్మతో పాటు మోనాల్ తల్లి కూడా వచ్చారు. అవినాష్ వాళ్ల అన్నయ్య.. సోహైల్ వాళ్ల అన్నయ్య, అఖిల్ అన్నయ్య కొడుకు, అరియానా చెల్లి ఇలా చాలా మంది మళ్లీ బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. అందులో భాగంగానే అఖిల్, అభిజీత్ మధ్య మరోసారి ఇంట్రెస్టింగ్ వార్ జరిగింది.

బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
ఈ వారం పులి మేక గేమ్‌లో ఎవరు రైట్.. ఎవరు రాంగ్ అనేది మరోసారి చర్చించాడు నాగార్జున. ఈ క్రమంలోనే మోనాల్ తల్లి గీత కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన ఆమెను నాగార్జున ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ఇప్పుడున్న గేమ్‌లో మోనాల్ కాకుండా మీకు ఎవరంటే బాగా యిష్టం.. మీ ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరు అని అడిగాడు. దానికి అంతా అఖిల్ అనే సమాధానమే వస్తుందని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అభిజీత్ పేరు చెప్పింది మోనాల్ తల్లి గీత.
దాంతో అక్కడున్న మోనాల్, అఖిల్ షాక్ అయ్యారు. అభిజీత్ అయితే పండగ చేసుకున్నాడు. పైగా పక్కనే ఉన్న మోనాల్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అభిజీత్ వెళ్తుంటే.. ఛల్ అంటూ తప్పుకుంది. అఖిల్ ఫేస్ కూడా మారిపోయింది. ఏదేమైనా కూడా అఖిల్‌ను కాదని అభిజీత్ పేరు చెప్పడం మోనాల్‌కు కూడా నచ్చలేదు. దీన్నిబట్టే అర్థమవుతుంది అభికి బయట ఎంత బాగా పాపులారిటీ పెరిగిపోయిందో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
November 21, 2020, 8:09 PM IST