Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: October 27, 2020, 10:03 AM IST
బిగ్ బాస్ 4 తెలుగు 8వ వారం నామినేషన్స్ (bigg boss 4 telugu)
బిగ్ బాస్ సీజన్ 4లో 8వ వారం నామినేషన్స్‌లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. అందులో చాలా మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ప్రతీవారి నామినేట్ అయ్యే అభిజీత్ ఈ సారి మాత్రం సేఫ్ జోన్లో ఉన్నాడు. ఈయన్ని ఎవరూ నామినేట్ చేయలేదు. మరోవైపు సోహైల్ కూడా నామినేట్ కాలేదు. ఈ వారం అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మ రాజశేఖర్, లాస్య నామినేషన్స్‌లో ఉన్నారు. ఇందులో అరియానా, అఖిల్, లాస్య చాలా స్ట్రాంగ్.. వాళ్లకు బయట కూడా బాగానే సపోర్ట్ ఉంది.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాంతో ఈ ముగ్గురు కచ్చితంగా సేవ్ అవుతారనే నమ్మకం అందర్లోనూ ఉంది. పైగా గతవారం నామినేషన్స్ నుంచి అందరికముందే ముందుగా అరియానా బయటికి వచ్చింది. ఈ లెక్కన బయట అరియానాకు ఉన్న ఫాలోయింగ్ అర్థమైపోతుంది. మరోవైపు లాస్యకు కూడా మంచి సపోర్ట్ ఉంది. ఈమెకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా భారీగానే జరుగుతున్నాయి. దాంతో ఈమె కూడా ఈజీగా సేఫ్ జోన్లోకి వస్తుంది. అఖిల్ కూడా తన గేమ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈయన కూడా రోజురోజుకీ స్ట్రాంగ్ అయిపోతున్నాడు. దాంతో అఖిల్‌కు ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు.

బిగ్ బాస్ 4 తెలుగు 8వ వారం నామినేషన్స్ (bigg boss 4 telugu)
ఎటొచ్చి ఈ వారం ముగ్గురు మాత్రం డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. వాళ్లే మోనాల్ గజ్జర్, మెహబూబ్, అమ్మ రాజశేఖర్. ఈ ముగ్గురిలో ఎక్కువగా అమ్మకు ఎఫెక్ట్ పడేలా కనిపిస్తుంది. దానికి కారణం ఈయన పెద్దగా గేమ్ ఆడకపోవడం. దివి ఎలిమినేట్ అయిన తర్వాత అమ్మ మరింత డల్ అయిపోయాడు. అయితే ఒకవేళ దివి ఫ్యాన్స్ అమ్మాని కాపాడాలని ఫిక్స్ అయితే మాత్రం ఈయన సేఫ్ అవుతాడేమో.. అంతకుమించి ఈ వారం అమ్మ బయటికి రావడం దాదాపు ఖరారైపోయింది.

అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar)
ఇదిలా ఉంటే మెహబూబ్ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇంట్లో టాస్కులు అందరికంటే బాగా చేస్తున్నది ఈయనే.. దాంతో ఆ కోణంలో సేవ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. కానీ గత వారం తనను సేవ్ చేసిన అరియానానే మళ్లీ ఈ వారం నామినేట్ చేసి విలన్ అయ్యాడు మెహబూబ్. అలా ఈయనకు ఈ వారం ఎలిమినేషన్ గండం కనిపిస్తుంది. అది పట్టించుకోకపోతే మనోడు సేఫ్ అవుతాడు.

మెహబూబ్ (Mehboob)
మూడో కంటెస్టెంట్ మోనాల్.. ఈమె గత రెండు వారాలుగా ఎలిమినేట్ అవుతుందేమో అనుకుంటుంటే బతికి బట్ట కట్టేస్తుంది. బిగ్ బాస్ కావాలనే ఈమెను సేవ్ చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతుంది. అఖిల్‌తో ప్రేమాయణం కారణంగా మోనాల్ సేవ్ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వారం కూడా ఇదే జరిగితే మరిన్ని విమర్శలు రావడం ఖాయం. అది జరక్కపోతే మాత్రం మోనాల్ ఈ వారం బయటికి రావడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక.. ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో..?
Published by:
Praveen Kumar Vadla
First published:
October 27, 2020, 10:03 AM IST