Bigg Boss 4 Telugu: పార్టీ మార్చిన మోనాల్.. అఖిల్‌ను వదిలేసి అవినాష్‌తో రొమాన్స్..

Bigg Boss 4 Monal Avinash: బిగ్ బాస్ సీజన్ 4 రెగ్యులర్‌గా చూస్తున్న వాళ్లకు అఖిల్, మోనాల్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడంటే అప్పుడు వీళ్ల రొమాన్స్ నడుస్తుంది. ఎప్పుడూ ఒకేచోట ఉంటారు.. పొద్దున్నే లేవగానే వెళ్లి అఖిల్‌కు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 21, 2020, 3:45 PM IST
Bigg Boss 4 Telugu: పార్టీ మార్చిన మోనాల్.. అఖిల్‌ను వదిలేసి అవినాష్‌తో రొమాన్స్..
అఖిల్, మోనాల్ గుజ్జర్ (akhil monal)
  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4 రెగ్యులర్‌గా చూస్తున్న వాళ్లకు అఖిల్, మోనాల్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడంటే అప్పుడు వీళ్ల రొమాన్స్ నడుస్తుంది. ఎప్పుడూ ఒకేచోట ఉంటారు.. పొద్దున్నే లేవగానే వెళ్లి అఖిల్‌కు కౌగిలింత ఇవ్వకపోతే రోజు మొదలవ్వకు మోనాల్‌కు. అలాగే పడుకునే ముందు అతడితోనే ఉంటుంది. అలా సాగిపోతుంది వాళ్ల రొమాన్స్. నిజంగానే ప్రేమించుకుంటున్నారేమో అని భ్రమపడేంతలా వీళ్ల రిలేషన్ సాగుతుంది అక్కడ. అయితే ఇప్పుడు మాత్రం మోనాల్ మాత్రం అఖిల్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. నిన్నటి వరకు అఖిల్‌తోనే చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఉన్నట్లుండి పార్టీ మార్చేసింది. అఖిల్ నుంచి ఫోకస్ అవినాష్‌‌పైకి మళ్లించేసింది. ఏమైందో తెలియదు కానీ కొత్త టాస్క్ మొదలైన తర్వాత అవినాష్‌తో మోనాల్ రొమాన్సుకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఎక్కడ పడితే అక్కడ కౌగిలింతలు.. ముద్దులు పెట్టేస్తుంది మోనాల్. టాస్కులో భాగంగానే ఇది చేస్తున్నా కూడా చూస్తున్న వాళ్లకు మాత్రం మరోలా అర్థమవుతుంది.


కొంటె రాక్షసులు, మంచి మనుషులు టాస్క్ మొదలైన తర్వాత అవినాష్, మోనాల్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ మొదలైపోయింది. అవినాష్ అలా దగ్గరికి వస్తున్నాడో లేదో వెంటనే వెళ్లి కౌగిలించుకుంటుంది మోనాల్. అది చూసి అఖిల్ మోహమంతా మాడ్చేసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో అవినాష్, మోనాల్ ఇద్దరూ ఒకే దగ్గర కూర్చుని బెడ్డుపై రొమాన్స్ చేసుకుంటున్నారు. అక్కడే ఉన్న అరియానా వీళ్ల రొమాన్స్ చూసి చచ్చిపోండి ఇద్దరూ అంటూ వెళ్లిపోయింది.

మోనాల్ అవినాష్ రొమాన్స్ (Monal Avinash Bigg Boss 4 Telugu)
మోనాల్ అవినాష్ రొమాన్స్ (Monal Avinash Bigg Boss 4 Telugu)


ఏదేమైనా కూడా అఖిల్ పార్టీ మార్చేసి ఉన్నట్లుండి అవినాష్ వైపు మోనాల్ రావడం మాత్రం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరోవైపు అభిజీత్ ఈమెను పూర్తిగా దూరం పెట్టేసాడు. దాంతో కేవలం అఖిల్ ఒక్కడితోనే ఉండలేక అవినాష్‌ను కూడా తోడు తెచ్చుకుంటుందంటూ సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియాలో.
Published by: Praveen Kumar Vadla
First published: October 21, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading