Bigg Boss 4 Telugu: లాస్య, మోనల్ సేఫ్..బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..

Bigg Boss 4 Telugu | తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో గా చెప్పుకునే బిగ్ బాస్ నాలుగో సీజన్ మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బయటకు ఎవరు వెళుతున్నారంటే..

news18-telugu
Updated: September 27, 2020, 12:05 AM IST
Bigg Boss 4 Telugu: లాస్య, మోనల్ సేఫ్..బిగ్‌బాస్ హౌస్‌లో ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో (Photo : Twitter)
  • Share this:
Bigg Boss 4 Telugu Updates | తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే హౌస్ నుంచి సూర్య కిరణ్, కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.  సూర్యకిరణ్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం వెనక  అతడి స్వయంకృతపరాధమే ఉందనే మాట మొదటి నుంచి వినిపించింది. స్వతహాగా దర్శకుడు అయిన సూర్యకిరణ్ అందరినీ తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని చూడటంతో అందరికీ శత్రువు అయ్యాడు. ఆ తర్వాత కరాటే కళ్యాణి.. హౌస్ మేట్స్ పై తనదైన శైలిలో కమాండింగ్ చేయడంతో అందరి దృష్టిలో బ్యాడ్ అయింది. దీంతో గత శనివారం కరాటే కళ్యాణి హౌస్ నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అయింది. గత వారం రెండు ఎలిమినేషన్లు ఉంటాయంటూ హడావుడి చేసినా...చివరకు దేత్తడి హారికను ఫేక్ ఎలిమినేషన్‌తో సరిపెట్టారు.  ఇప్పుడిక మూడో వారంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న అంశం ఆసక్తిరేపుతోంది.  అటు కుమార్ సాయి, అవినాష్ ఇప్పటికే హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా...శుక్రవారం హౌస్‌లోకి ప్రవేశించిని స్వాతి దీక్షిత్ తన అందచందాలతో అలరిస్తోంది.

బిగ్‌బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
బిగ్‌బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)


లాస్య, మోనల్ సేఫ్..
రాను రాను  బిగ్ బాస్ 4 సీజన్ మెల్లగా పుంజుకుంటుంది. ఒక్కోరోజు ఒక్కో రకంగా టాస్కులు ఇస్తున్నాడు బిగ్ బాస్. ముఖ్యంగా మూడో వారం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఆసక్తికరంగా మారిపోయింది. పైగా ఇంట్లో కూడా ఒకరి మధ్య ఒకరికి బాగానే పుల్లలు పెట్టాడు బిగ్ బాస్. దాంతో ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. ఓ రకంలో అందరి నిజస్వరూపాలను టాస్క్‌లు బయటపడేలా చేస్తున్నాయి.  ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా కూడా ఒకరిపై ఒకరు చాలా సెటైర్లు వేసుకున్నారు. గత వారంలానే ఈ సారి కూడా కుమార్ సాయి అందరికీ సేఫ్ టార్గెట్ అయ్యాడు.  ఈ వారం హౌస్‌లో లాస్య, మోనల్ గజ్జర్ సేఫ్ అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.

ఇక ఈ వారం ఇంట్లోంచి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఐదుగురు నామినేషన్‌లో మిగిలారు. అందులో కుమార్ సాయి, దేవి, హారిక, మెహబూబ్, అరియానా గ్లోరి ఉన్నారు. ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా దిల్ సే మెహబూబ్, దేవి ఇద్దరిలో ఎవరు ఒకు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. లీకు వీరుల కథనం మేరకు హౌస్ నుంచి దేవి ఎలిమినేట్ అయినట్లు సమాచారం.

శుక్రవారం  బిగ్‌‌బాస్ హౌస్‌లోకి స్వాతి దీక్షిత్  వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె ఎంట్రీతో బిగ్‌బాస్ హౌస్‌లో 17 మంది  సభ్యలయ్యారు.  ఆదివారం ఒకరు ఎలిమినేట్ అయితే.. 16 మంది హౌస్‌మేట్స్ ఉండనున్నారు. మరి మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరు హౌస్ నుంచి నిష్క్రమిస్తారనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 26, 2020, 9:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading