Home /News /movies /

BIGG BOSS 4 TELUGU MEHBOOB HINTS SOHEL TO TAKE MONEY AND VIDEO GOES VIRAL PK

Bigg Boss 4 Telugu: డబ్బు ముఖ్యం సోహెల్.. అడ్డంగా బుక్ అయిపోయిన మెహబూబ్..

మెహబూబ్ సోహైల్ (Mehboob sohail Bigg Boss)

మెహబూబ్ సోహైల్ (Mehboob sohail Bigg Boss)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ముందుగా చెప్పే పేర్లు సోహెల్, మెహబూబ్. ఈ ఇద్దరూ కలిసి ఎంత రచ్చ చేయాలో అంతా చేసారు. మెహబూబ్ ఉన్న 70 రోజులు ఇంట్లో మామూలు రచ్చ కాదు.

బిగ్ బాస్ 4 తెలుగులో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా ముందుగా చెప్పే పేర్లు సోహెల్, మెహబూబ్. ఈ ఇద్దరూ కలిసి ఎంత రచ్చ చేయాలో అంతా చేసారు. మెహబూబ్ ఉన్న 70 రోజులు ఇంట్లో మామూలు రచ్చ కాదు. అంతగా ఈ ఇద్దరూ కుమ్మేసారు. అరె ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాల్రా అనేలా ఉన్నారు ఈ ఇద్దరూ. మెహబూబ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నపుడు సోహెల్ మామూలుగా ఏడవలేదు. దాన్నిబట్టి ఈ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. అయితే టాప్ 3లో ఉన్న ఈయన ఇప్పుడు 25 లక్షలతో బయటికి వచ్చేసాడు. అది కొందరికి షాక్ ఇచ్చింది. సోహెల్ నిర్ణయంపై అంతా షాక్ అయిపోయారు. అరే ఏంటి ఇలా చేసాడు సోహెల్ అంటూ ఆయనకు ఓట్లు వేసిన వాళ్లు కూడా పరేషాన్‌లో ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం వచ్చీ రాగానే సోహెల్‌ను గట్టిగా ఎత్తుకుని తిప్పేసాడు. అయితే ఈ 25 లక్షల వెనక చాలా పెద్ద కథ ఉంది. నిజానికి సోహెల్ పాతిక లక్షలు తీసుకోడానికి కారణం మెహబూబ్. అదెలా అనుకుంటున్నారా.. ఫైనలిస్టులు ఇంట్లో ఉన్నపుడు పాత కంటెస్టెంట్స్‌ను పంపించారు. ఫైనలిస్టులకు ఎవరు టాప్‌లో ఉన్నారు.. ఎవరు తక్కువగా ఉన్నారు అనేది అర్థం కావడం లేదు. అలాంటి సమయంలో ఇంట్లోకి వచ్చిన మెహబూబ్ చేతితోనే సోహెల్‌కు సైగలు చేసాడు.

నువ్వు గెలవవు అంటూ ముందుగానే హింట్ ఇచ్చేసాడు. డబ్బులు తీసుకో అంటూ చేతితో సైగలు చేసాడు. అచ్చంగా తన స్నేహితుడు ఏం చెప్పాడో ఇప్పుడు అలాగే చేసాడు సోహెల్. అందివచ్చిన 25 లక్షలు తీసుకున్నాడు. దాంతో పాటు అనాథాశ్రమానికి సోహెల్ ఇస్తానన్న 10 లక్షలు కూడా నాగార్జున ఇచ్చేసాడు. దాంతో మొత్తం 25 లక్షలు ఇంటికి తీసుకెళ్తున్నాడు సోహెల్. అయితే ఈ మొత్తం సీన్‌లో అక్కడ డబ్బులు ఇస్తారని మెహబూబ్‌కు ఎలా తెలుసు అని అనేది మాత్రం అర్థం కాని విషయం.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు