Bigg Boss 4 Telugu: ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ అదిరింది.. బిగ్ బాస్ రికార్డ్ పగిలింది..

Telugu Bigg Boss Season 4: బిగ్ బాస్ సీజన్ 4 అదిరిపోయేలా మొదలైంది. ఇది స్టార్ట్ అయి ఇప్పటికే రెండు వారాలు కావొస్తుంది. ఇప్పటి వరకు రేటింగ్స్ ఎలా ఉన్నాయనేది బయటికి రాలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2020, 11:18 AM IST
Bigg Boss 4 Telugu: ఫస్ట్ ఎపిసోడ్ రేటింగ్ అదిరింది.. బిగ్ బాస్ రికార్డ్ పగిలింది..
బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)
  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4 అదిరిపోయేలా మొదలైంది. ఇది స్టార్ట్ అయి ఇప్పటికే రెండు వారాలు కావొస్తుంది. ఇప్పటి వరకు రేటింగ్స్ ఎలా ఉన్నాయనేది బయటికి రాలేదు. అయితే సీజన్ 4 మొదలైన తర్వాత తొలి వారం రేటింగ్స్ వచ్చాయి. ఇది చూసిన తర్వాత మా టీవీ యాజమాన్యం ఊహించిన దానికంటే మంచి రేటింగ్ వచ్చినట్లు అర్థమవుతుంది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 18.6 రేటింగ్ వచ్చింది. టిఆర్పీ పరంగా చూసుకుంటే ఇది బాంబ్ అనుకోవచ్చు.

బిగ్‌బాస్ 4 (Twitter/Photo)
బిగ్‌బాస్ 4 (Twitter/Photo)


ఎందుకంటే గతంలో ఏ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు రానంతగా ఈ సారి రేటింగ్ వచ్చింది. లాక్‌డౌన్ సమయం కావడం.. పెద్దగా ఎంటర్టైన్మెంట్ కూడా లేకపోవడం.. సినిమా థియేటర్స్ మూసేయడం అన్నీ బిగ్ బాస్ సీజన్ 4కి కలిసొచ్చాయి. దాంతో రేటింగ్స్ కూడా ఓ రేంజ్‌లో వచ్చాయి. 18.6 రేటింగ్ అంటే చిన్న విషయం అయితే కాదు. కచ్చితంగా ఇది భారీ రికార్డ్ అన్నమాట. నాగార్జున హోస్టింగ్ కూడా ఈ సీజన్‌కు బాగానే కలిసొస్తుంది.

Bigg Boss Telugu 4 Live Updates (బిగ్ బాస్ 4 అప్‌డేట్స్)
Bigg Boss Telugu 4 Live Updates (బిగ్ బాస్ 4 అప్‌డేట్స్)


తెలిసిన కంటెస్టెంట్స్ పెద్దగా లేకపోయినా కూడా ఎపిసోడ్ ఎపిసోడ్‌కు ఆసక్తికరమైన ఎంటర్‌టైన్మెంట్ ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దాంతో రానున్న రోజుల్లో రేటింగ్ మరింత బాగా వస్తుందని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూసుకుంటే మూడో సీజన్‌తో పోలిస్తే నాలుగో సీజన్ చాలా బెటర్‌గా మొదలైంది. అయితే ఇదే జోరు మున్ముందు కొనసాగుతుందా లేదా అనేది అనుమానమే.

బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)
బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)


ఎందుకంటే సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్ సీజన్ షురూ కానుంది. ఒక్కసారి అది మొదలైతే కచ్చితంగా బిగ్ బాస్ రేటింగ్స్‌పై ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తుంది. అప్పుడు కూడా బిగ్ బాస్ తట్టుకుని నిలబడిందంటే మాత్రం అద్భుతమే. చూడాలి మరి ఏం జరుగుతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: September 17, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading