బిగ్ బాస్ 4 తెలుగులో ఇప్పటికే 10 వారాలు గడిచిపోయింది. ప్రతీవారం వీకెండ్ వస్తుందంటే చాలు ఎవరు ఉంటారు అనే దానికంటే కూడా ఎవరు వెళ్లిపోతారు అనేానిపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. దానికితోడు ఈ వారం మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఓట్ల ప్రకారం చూస్తుంటే ఈ వారం కచ్చితంగా అభిజీత్ సేవ్ అవ్వడం ఖాయం. అందరికంటే ఎక్కువగా ఈయనకే ఓట్లు పడుతున్నాయి. సుమారు 50 శాతం ఓట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు ఈయన. సోహైల్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అభి తర్వాత ఈయనకే బాగా ఓట్లు పడుతున్నాయి. ఇక తన ఒరిజినల్ గేమ్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న అరియానా.. ఓట్ల పరంగా మూడో స్థానంలో ఉందని ప్రచారం జరుగుతుంది. కెప్టెన్ కావడం.. పైగా కాస్త గట్టి గేమ్ ఆడుతుండటంతో ఈ వారం వరకు హారికకు వచ్చిన ప్రమాదం అయితే లేదు. కచ్చితంగా ఈమె సేవ్ అయ్యేలాగే కనిపిస్తుంది.
దాదాపు 18 శాతం ఓట్లు ఈమెకు పడుతున్నాయి. విచిత్రం ఏంటంటే మోనాల్ గజ్జర్ కూడా ఓట్లలో బాగానే ముందుకెళ్తుంది. హాట్ స్టార్ పరంగా చూసుకుంటే మాత్రం మోనాల్ 15 శాతం ఓట్లు అందుకుంటుంది. పైగా ఈ వారం కెప్టెన్సీ టాస్కులో హారికకు సపోర్ట్ చేయాలని మోనాల్ తీసుకున్న నిర్ణయం.. ఆమె కోసం అఖిల్‌ను కూడా పక్కనబెట్టడంతో కాస్త ఇమేజ్ పెరిగింది. ఇక్కడే ఓట్లు కూడా పెరిగినట్లు తెలుస్తుంది. చివరి నిమిషంలో మోనాల్ ఓట్లలో ముందుకెళ్లిందని వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ వారం లాస్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోనుంది.
మొన్నటి వరకు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్న లాస్యకు ఇప్పుడు ఓట్లు తక్కువగా పడ్డాయి. ఈమె అందరికంటే చివర్లో ఉంది. దాంతో సీమ బిడ్డ ఈ వారం నుంచి ఇంటి ముఖం పట్టనుంది. లాస్య ఎలిమినేషన్ మాత్రం అందరికీ షాకే. ఎందుకంటే కచ్చితంగా చివరి వరకు ఉంటుందని అంతా అంచనా వేసారు. కానీ ఇంట్లో లాస్య ఏం చేయకుండా ఉండటం.. కాంట్రవర్సీలకు కూడా దూరంగానే ఉండటంతో ఈమెకు అంతగా కలిసిరాలేదు. మరోవైపు మోనాల్ గ్లామర్ షో చేస్తుండటంతో ఆమె ఓట్ల పరంగా ముందుకెళ్తుంది. అన్నింటికి మించి అఖిల్, అభి మధ్య గేమ్ ఆడుతుంది మోనాల్. అదే ఆమెకు వరం.. లాస్యకు శాపంగా మారింది. మరి లాస్య ఎలిమినేషన్ తర్వాత గేమ్‌లో మార్పులు మరెంతగా ఉండబోతున్నాయో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.