Bigg Boss 4 Lasya Elimination: ఇట్స్ అఫీషియల్.. బిగ్ బాస్ నుంచి లాస్య ఎలిమినేటెడ్..

Bigg Boss 4 Lasya Elimination: ఊహించిందే జరిగింది.. ఈ వారం బిగ్ బాస్ నుంచి లాస్య బయటికి వచ్చేస్తుందని రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. చివరి వరకు ఉంటుందనుకున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ చివరి దశలో వచ్చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 22, 2020, 10:09 PM IST
Bigg Boss 4 Lasya Elimination: ఇట్స్ అఫీషియల్.. బిగ్ బాస్ నుంచి లాస్య ఎలిమినేటెడ్..
బిగ్ బాస్ 4 లాస్య (Bigg Boss 4 Lasya)
  • Share this:
ఊహించిందే జరిగింది.. ఈ వారం బిగ్ బాస్ నుంచి లాస్య బయటికి వచ్చేస్తుందని రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. చివరి వరకు ఉంటుందనుకున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ చివరి దశలో వచ్చేసింది. మరో ఐదు వారాల గేమ్ మిగిలి ఉండగానే అంతలోనే ఇంటికి వచ్చేసింది లాస్య. 11వ వారం ఎలిమినేషన్స్‌లో లాస్య ఉంది. ముందు నుంచి కూడా ఓటింగ్ బాగానే వస్తున్నా గత రెండు మూడు వారాలుగా ఈమె గేమ్ అంతగా ఏం లేదు. ఇంట్లో ఖాళీగానే ఉండిపోయింది. పైగా టాస్కుల్లో కూడా పెద్దగా పర్పార్మ్ చేయట్లేదనే విమర్శలు కూడా వచ్చాయి. పైగా గోపీ మాదిరి అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ మోస్తుందనే పేరు కూడా లాస్యకు ఉంది. ముఖ్యంగా అఖిల్ ఫేక్ ఎలిమినేషన్ తర్వాత అతడి గురించి మాట్లాడుకోవడం.. మోనాల్ గురించి చెడుగా చెప్పడం.. మిగిలిన కంటెస్టెంట్స్ గురించి కామెడీ చేయడం లాంటివి కూడా ఈమెకు మైనస్ అయిపోయాయి. అదే లాస్యకు ఓట్లు తక్కువగా పడటం వెనక కారణం అంటున్నారు విశ్లేషకులు. లేదంటే కచ్చితంగా టాప్ 2 వరకు ఉంటుందని నమ్మకంగా ఉన్నా కూడా ఎందుకో మరి 11వ వారమే బయటికి వచ్చేసింది లాస్య. ఈమె ఎలిమినేషన్ కూడా ఓ రకంగా షాకే. ఎందుకంటే మోనాల్ బయటికి వచేస్తుందని చాలా వారాల నుంచి ప్రచారం జరుగుతున్నా కూడా ఈమె మాత్రం ప్రతీ వారం సేవ్ అవుతూనే ఉంది. ఇప్పుడు లాస్యను కూడా వెనక్కి నెట్టి లోపలే ఉండిపోయింది మోనాల్.
Published by: Praveen Kumar Vadla
First published: November 22, 2020, 10:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading