Bigg Boss 4 Telugu: స్వాతి దీక్షిత్‌లో అది నచ్చలేదు..ఓపన్‌గా చెప్పేసిన లాస్య

Bigg Boss Telugu 4 Updates: బిగ్ బాస్ హౌస్‌లోకి శుక్రవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌(Swathi Deekshith)కు లాస్య(Anchor Lasya) ఆదిలోనే షాక్ ఇచ్చింది. స్వాతి దీక్షిత్‌లో తనకు నచ్చనిది ఏంటో ఓపన్‌గా చెప్పేసింది.

news18-telugu
Updated: September 27, 2020, 12:58 AM IST
Bigg Boss 4 Telugu: స్వాతి దీక్షిత్‌లో అది నచ్చలేదు..ఓపన్‌గా చెప్పేసిన లాస్య
స్వాతి దీక్షిత్, లాస్య
  • Share this:
Bigg Boss 4 Telugu Latest Updates: బిగ్ బాస్ హౌస్‌లోకి శుక్రవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌కు లాస్య ఆదిలోనే షాక్ ఇచ్చింది. స్వాతి దీక్షిత్‌లో తనకు నచ్చనిది ఏంటో ఓపన్‌గా చెప్పేసింది. హౌస్‌లోని కంటెస్టుల్లో నచ్చనిది ఏంటో చెప్పాలంటూ ప్రత్యేక టాస్క్ ఇచ్చిన హోస్ట్ నాగార్జున...వారి మధ్య మళ్లీ పుల్లలు పెట్టాడు. దీంతో సభ్యులు ఒక్కొక్కరుగా మరొకరిలో తమకు నచ్చనిది ఏంటో చెప్పేశారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కరోజో అయిన స్వాతి దీక్షిత్..హౌస్‌లో ఎవరితో సన్నిహితంగా ఉండాలో ముందే నిర్ణయించుకుని వచ్చినట్లు కనిపిస్తోందని లాస్య పేర్కొంది. నోయల్, హారిక తదితరులు కొందరితోనే హౌస్‌లో స్వాతి సన్నిహితంగా ఉంటోందని చెప్పింది.  అలా కాకుండా హౌస్‌లోని అందరినీ సమానంగా ట్రీట్ చేస్తూ...అందరితో కలిసి ఉంటే బాగుందని పేర్కొంది. లాస్య ఎత్తిచూపిన అంశాన్ని గుర్తుంచుకోవాలని స్వాతికి నాగార్జున సలహా ఇచ్చాడు.

యాంకర్ లాస్య మంజునాథ్(Photo/Star Maa)


దేత్తడి హారిక ఇజ్జత్ పాయె..
అటు దేత్తడి హారిక ఇజ్జత్ తీసింది గంగవ్వ. బ్రష్ చేసుకోకుండానే హారిక టీ, కాఫీలు తాగుతోందని..ఇది తనకు నచ్చడంలేదని అవ్వ ఓపన్‌గా చెప్పేయడంతో హారిక కాస్త ఇబ్బందిపడింది. బ్రష్ చేసుకుని, వేడినీళ్లు తాగిన తర్వాతే తాను ఏమైనా తీసుసుకుంటానన్న హారిక..గంగవ్వ అది గమనించినట్లు లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అటు దివికి ఎప్పుడు నవ్వాలో? ఎప్పుడు ఏడ్వాలో? తేలీదని..ఆమెలో తనకు అది నచ్చని విషయని చెప్పారు అమ్మ రాజశేఖర్. అభిజిత్ హౌస్‌లో అందరితో కలవడం లేదని సుజాత్ పాయింట్ ఔట్ చేసింది. అఖిల్ చిన్న చిన్న విషయాలకే కోప్పడటం తనకు నచ్చడం లేదని చెప్పింది మోనల్.

మాస్టర్‌వి కుళ్లు జోకులు..
మాస్టర్ అమ్మ రాజశేఖర్‌ది చిన్న పిల్లల మనస్తత్వమని, కుళ్లు జోకులు వేస్తున్నారని నోయల్ ఓపన్‌గా చెప్పేయగా...గంగవ్వలో తనకు నచ్చని అంశాలు ఏంటో దేవి వివరించింది. గంగవ్వకు ఒకరు నచ్చితే...తప్పు చేసినా వారినే సమర్థిస్తుందని దేవి పేర్కొంది. హౌస్‌లో ఏం జరుగుతోందని లాస్య ఎక్కువగా కంగారు పడుతోందని, ఇది తనకు నచ్చడం లేదని అవినాష్ పేర్కొన్నాడు. అభిజిత్ కనిపించేటంత అమాయకుడు కాదని దివి కామెంట్ చేసింది.

ఉత్తమ కంత్రిగా అవినాష్..కాగా టాస్క్‌లో మనుషులపై విజయం సాధించిన రోబో టీమ్‌లోని ముగ్గురు సభ్యులకు అవార్డులు ప్రదానం చేయించారు హోస్ట్ నాగార్జున. ఉత్తమ నటుడు(హీరో) అవార్డును రోబో టీమ్‌ను గంగవ్వకు ఇవ్వాలని హౌస్‌లోని సభ్యులందరూ అభిప్రాయపడగా...టీమ్‌ను లీడ్ చేసిన అభికి ఆ అవార్డుకు ఎంపిక చేశాడు హోస్ట్ నాగార్జున. అమ్మ రాజశేఖర్ దగ్గర ఎంతో చాకచక్యంగా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టించుకున్న అవినాష్‌కు ఉత్తమ కంత్రి అవార్డును ఇప్పించాడు. అటు ఏమీ తెలియనట్లు నటిస్తూ మనుషులను ఇబ్బందుల్లోకి నెట్టిన గంగవ్వకు ఉత్తమ నటి అవార్డును ఇప్పించాడు. గంగవ్వ నటకు సంబంధించిన క్లిప్‌ను వేసి చూపించగా...హౌస్ సభ్యులు ఆమె అమాయక నటనకు నివ్వెరపోయారు. ఇదంతా టీవీలో రికార్డయ్యిందా? అంటూ గంగవ్వ షాక్‌కు గురైయ్యింది.
Published by: Janardhan V
First published: September 27, 2020, 12:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading