బిగ్ బాస్ హౌజ్ అంటేనే మాస్కులు అనే ప్రచారం బయట జరుగుతుంది. అంటే బయటికి ఒకలా.. లోపల మరోలా ఉంటారు మనషులు. అక్కడ ఉన్నదున్నట్లు ఉంటే కచ్చితంగా బయటికి వచ్చేస్తారంటూ ఇప్పటికే చాలా మంది చెప్పుకున్నారు కూడా. ఇప్పుడు కరాటే కళ్యాణి కూడా ఇదే చెప్పుకుంటుంది. తాను నటించలేకపోయాను కాబట్టే ఇంట్లో ఉండలేకపోయాను అంటూ కామెంట్ చేసింది. అయితే ఎంతమంది ఉన్నా కూడా ఒక్కరు మాత్రం చాలా జెన్యూన్ అంటూ ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది.
ఆమెవరో కాదు గంగవ్వ. పాపం ఈమెకు ఏం తెలియదు.. అక్కడెలా ఉండాలో కూడా అర్థం కాదు.. ఉన్నదున్నట్లు మాట్లాడుతుంది.. మొహం మీదే చెప్పేస్తుంది.. ఈమెకు నాటకాలు రావు అంటూ అంతా చెప్పుకొచ్చారు. అది నిజమే కూడా.. ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ మాదిరి గంగవ్వకు నాటకం ఆడటం లేదు.. బయట ఒకలా లోపల ఒకలా ఉండటం కూడా ఈమెకు తెలియని పని. భయం లేకుండా ఉన్నదున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. నాగార్జున దగ్గర కూడా ఏం కావాలంటే అది చెప్తుంది గంగవ్వ.
అసలు ఈమె జోరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించడం లేదు. పైగా హౌజ్లో కూడా అంతా ఆమెకు గౌరవం ఇస్తున్నారు.. ఆమె అంటే యిష్టపడుతున్నారు. గంగవ్వ జెన్యూన్ అంటూ అంతా ఈమెను హీరో చేసారు. కానీ కరాటే కళ్యాణి మాత్రం మరోలా చెప్తుంది. ఇంట్లో అందరికీ మాస్కులు ఉన్నాయని చెప్పింది. అంతేకాదు చివరికి గంగవ్వ కూడా డ్రామాలు ఆడుతుందని.. ఆమెకు గేమ్ అర్థమైందని చెప్పింది కళ్యాణి. ఆమె కూడా మాస్కులోనే ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
చాలా తెలివిగా గంగవ్వ అక్కడ ఆడుతుందని.. ఆమెకు తక్కువ అంచనా వేయడానికి లేదని చెప్పింది ఈమె. గంగవ్వకు ఏం తెలియదు అనుకుంటే అది మన పొరపాటే అంటుంది ఈమె. అయితే అమాయకంగా ఉండే గంగవ్వపై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మాత్రం మండి పడుతున్నారు. ఆమెపై కూడా విమర్శలు చేయడం అవసరమా.. అలా అందరిపై నోరు పారేసుకుని ఇంటి నుంచి బయటికి వచ్చావు.. అయినా కూడా మళ్లీ నువ్వు బుద్ధి మార్చుకోలేదంటూ కళ్యాణిపై ఫైర్ అవుతున్నారు గంగవ్వ ఫ్యాన్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Karate Kalyani, Telugu Cinema, Tollywood