HOME »NEWS »MOVIE »bigg boss 4 telugu kannada bigg boss host kichcha sudeep special guest for nagarjuna host telugu bigg boss 4 ta

Bigg Boss 4 Telugu: తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునతో కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ సుదీప్..

Bigg Boss 4 Telugu: తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునతో కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ సుదీప్..
తెలుగు బిగ్‌బాస్‌ నాగార్జునతో కన్నడ బిగ్‌బాస్ సుదీప్ (Twitter/Photo)

Bigg Boss 4 Telugu | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో ఈ శని వారంతో 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలో అడుగుపెట్టింది. ఈ ఆదివారం తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో సుదీప్ సందడి చేయనున్నాడు.

  • Share this:
    Bigg Boss 4 Telugu | తెలుగు సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో బిగ్‌బాస్ షో దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో ఈ శని వారంతో 12 వారాలు పూర్తి చేసుకొని 13వ వారంలో అడుగుపెట్టింది. అంటే బిగ్‌బాస్ స్టార్ట్ అయి అపుడే 84 రోజులు పూర్తి చేసుకుంది. అంటే ఇంకా ఎక్కువలో ఎక్కువగా మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్ షోకు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే మూడు సీజన్స్‌లో మేల్ కంటెస్టెంట్స్ మాత్రమే విజేతలుగా నిలిచారు. కాబట్టి.. ఈ సారి బిగ్‌బాస్ 4 విజేతగా ఫీమేల్ కంటెస్టెంట్‌కు వచ్చే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి టాప్ 7 కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్నారు. అందులో అభిజీత్, హారిక, అఖిల్, మోనాల్, సోహైల్, అవినాష్, అరియానా ఉన్నారు. వాళ్లలో ఈ వారం అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ నామినేట్ అయ్యారు. ఇప్పటికే ఈ వారం వచ్చిన ఓట్లను బట్టి చూస్తే అఖిల్, మోనాల్ టాప్ 2లో ఉన్నారు. ఈ ఇద్దరూ ఈజీగా సేవ్ అయిపోయారు.

    చివరగా అవినాష్‌కు అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయి. దాంతో మనోడు ఎలిమినేట్ అయిపోయాడు. అనుక్షణం నామినేషన్ అంటే వణికిపోయే అవినాష్‌కు ఇది నిజంగా షాకే. అయితే ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉపయోగించి తనను తాను సేవ్ చేసుకున్నాడు అవినాష్.అలా ఈ వారం ఎలిమినేట్ అయినా కూడా బయటికి వెళ్లలేదు. దాంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత నాలుగు వారాల్లో రెండు వారాల్లో ఇద్దర్ని ఎలిమినేట్ చేసి.. చివరి రెండు వారాల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. అందులోంచి ముగ్గురు వెళ్లిపోయి టాప్ 2 మిగులుతారు. టాప్ 2ను స్టేజీపై పిలిచి వాళ్లలో విజేత ఎవరో ప్రకటిస్తారు. అలా 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ లేకుండానే ముగించేసేసారు నిర్వాహకులు. ఈ సంగతి పక్కన పెడితే... ఈ వారం హౌస్‌లో కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ముఖ్యఅతిథిగా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.




    ఈ దసరాకు సమంత హోస్ట్‌గా అఖిల్... బిగ్‌బాస్ వేదికపై ‘మోస్ట్ ఎలిజిబుల్’ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఈ రోజు కన్నడ స్టార్ హీరో సుదీప్.. తన లేటెస్ట్ మూవీ ‘ఫాంథమ్’ ప్రమోషన్‌లో భాగంగా బిగ్‌బాస్ షోలో సందడి చేయనున్నాడు.


    తెలుగులో బిగ్‌బాస్ షోకు హాజరైన విషయాన్ని సుదీప్ సోషల్ మీడియా వేదిగా వెల్లడించాడు. నాగార్జునతో కలిసి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేయనున్నారు. మరి సుదీప్ రాకతో బిగ్‌బాస్ హౌస్‌ కంటెస్టెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:November 29, 2020, 13:54 IST