• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • BIGG BOSS 4 TELUGU KAMAL HAASAN SPOTTED IN TELUGU SHOW THROUGH VIRTUAL REALITY PK

Bigg Boss 4 Telugu Kamal Haasan: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. బిగ్ బాస్ 4 తెలుగులో లోకనాయకుడు..

Bigg Boss 4 Telugu Kamal Haasan: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. బిగ్ బాస్ 4 తెలుగులో లోకనాయకుడు..

కమల్ హాసన్ నాగార్జున (bigg boss 4 telugu)

Bigg Boss 4 Telugu Kamal Haasan: బిగ్ బాస్ 4 తెలుగులో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మరోటి కూడా జరిగింది. తాజాగా నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్నే తెలుగు షోకు ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు..

  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మరోటి కూడా జరిగింది. తాజాగా నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్నే తెలుగు షోకు ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు తెలుగు నిర్వాహకులు. ప్రస్తుతం తమిళనాట కూడా బిగ్ బాస్ 4 నడుస్తుంది. అక్కడ ఈ మధ్యే మొదలైంది ఈ షో. తొలి నాలుగు సీజన్స్‌కు కూడా కమల్ హాసన్‌ హోస్టుగా ఉన్నాడు. తెలుగులో మాత్రం మూడు, నాలుగు సీజన్స్ నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్‌లో కమల్ హాసన్ వచ్చాడు. వర్చువల్ స్టూడియో ఆధారంగా లోక నాయకుడిని తెలుగు షోకు తీసుకొచ్చారు. ఇక్కడి వాళ్లు అక్కడి వాళ్లను.. అక్కడి కంటెస్టెంట్స్ ఇక్కడి వాళ్లను కలిసారు. ఇక నాగార్జున కూడా కమల్ హాసన్‌ను తనదైన శైలిలో ఆహ్వానించాడు. దేశం గర్వించదగ్గ నటుడు.. వన్ అండ్ ఓన్లీ కమల్ హాసన్ ఈ రోజు మన షోకు వచ్చారు అంటూ నాగార్జున వర్చువల్ స్టూడియో వైపు చూపించాడు. అక్కడ వచ్చిన కమల్ హాసన్ ఇంటి సభ్యులను పలకరించాడు.

అందరూ ఎలా ఉన్నారు అంటూ అడిగేసరికి.. సూపర్ సర్ అంటూ చెప్పారు. మరోవైపు తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను కూడా తెలుగు వాళ్లు పలకరించారు. మధ్యలో కమల్ హాసన్, నాగార్జున వారధులుగా ఉన్నారంతే. ఈ ఎపిసోడ్ చూసి అంతా ఫిదా అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రోమో చూస్తుంటేనే అదిరిపోతుంది. మధ్యలో నాగార్జున, కమల్ కామెడీ కూడా చేసుకున్నారు. సర్ మీ హౌజ్ ఫుల్లుగా ఉంది సర్ అంటే.. నాకు హౌజ్ ఫుల్ అనే మాట యిష్టమంటూ చెప్పాడు కమల్. నాగార్జున కూడా వెంటనే మనందరికీ హౌజ్ ఫుల్ అనే మాట చాలా యిష్టమని చెప్పాడు. మొత్తానికి కమల్, నాగార్జున ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: