Bigg Boss 4 Hyper Aadi: బిగ్ బాస్‌లో అడుగు పెట్టిన హైపర్ ఆది.. ఇక పంచ్‌ల వర్షమే..

Bigg Boss 4 Hyper Aadi: మీరు చూసింది నిజమే.. నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్‌లోకి హైపర్ ఆది వచ్చాడు. పంచుల వర్షం కురిపించడానికి వచ్చేసాడు ఈ జబర్దస్త్ కమెడియన్. వచ్చీ రావడంతోనే రచ్చ రచ్చ చేసాడు ఈయన.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 25, 2020, 3:52 PM IST
Bigg Boss 4 Hyper Aadi: బిగ్ బాస్‌లో అడుగు పెట్టిన హైపర్ ఆది.. ఇక పంచ్‌ల వర్షమే..
బిగ్ బాస్ 4 తెలుగులో హైపర్ ఆది (bigg boss 4 telugu)
  • Share this:
మీరు చూసింది నిజమే.. నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్‌లోకి హైపర్ ఆది వచ్చాడు. పంచుల వర్షం కురిపించడానికి వచ్చేసాడు ఈ జబర్దస్త్ కమెడియన్. వచ్చీ రావడంతోనే రచ్చ రచ్చ చేసాడు ఈయన. అసలు విషయం ఏంటంటే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్లిపోయాడు. అక్కడే మూడు వారాల పాటు ఉండబోతున్నాడు. దాంతో బిగ్ బాస్ సీజన్ 4ను ఆయన మూడు వారాల వరకు మిస్ అవుతున్నాడు. అందుకే సమంతను తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆమెతో ఏకంగా దసరా స్పెషల్ ఈవెంట్ చేసారు. ఒకటి రెండు కాదు.. నాలుగు గంటల పాటు సాగే ఈ ఈవెంట్ కోసం భారీగానే ప్లాన్ చేసారు స్టార్ మా యాజమాన్యం. అందులో చాలా స్పెషల్స్ దాచేసారు. ముఖ్యంగా హీరో కార్తికేయతో పాటు అఖిల్ అక్కినేని కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక హైపర్ ఆది కూడా వచ్చి తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసాడు. సాధారణంగా అయితే ఆదివారం రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ మొదలవుతుంది.


కానీ దసరా కానుకగా సాయంత్రం 6 గంటలకే ఎపిసోడ్ మొదలు పెట్టారు. అక్కడ్నుంచి రాత్రి వరకు కంటిన్యూస్‌గా ఈ షో జరగనుంది. అందులో సమంత అక్కినేనితో పాటు అఖిల్, కార్తికేయ కూడా సందడి చేయబోతున్నారు. వాళ్ళతో పాటు పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక హైపర్ ఆదిని తీసుకొచ్చి ట్రూత్ గేమ్ ఆడించారు. హౌజ్ మేట్స్‌ను కాసేపు బాగానే ఆడుకున్నాడు ఆది. ముఖ్యంగా తన తోటి జబర్దస్త్ కమెడియన్ అవినాష్‌ను ఆట పట్టించాడు.
బిగ్ బాస్ 4 తెలుగులో హైపర్ ఆది (bigg boss 4 telugu)
బిగ్ బాస్ 4 తెలుగులో హైపర్ ఆది (bigg boss 4 telugu)

అంతేకాదు మోనాల్, అఖిల్, నోయల్ లాంటి వాళ్లను ఫుల్లుగా ఆడేసుకున్నాడు. అఖిల్‌ను అయితే మోనాల్ విషయంలో ఆట పట్టించాడు. ఈ ప్రపంచంలో ముగ్గురే మంచోళ్ళున్నారు. ఒకటి సీతమ్మ వాకిట్లో ప్రకాశ్ రాజ్.. రెండు బ్రహ్మోత్సవం సత్యరాజ్.. మూడు నువ్వే భయ్యా అంటూ నోయల్‌ను ట్రోల్ చేసాడు. అలాగే సమంతతో కూడా బాగానే పంచులు వేసాడు ఆది. ఏదేమైనా బిగ్ బాస్ షో దసరా స్పెషల్‌లో మాత్రం దుమ్ము లేచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Published by: Praveen Kumar Vadla
First published: October 25, 2020, 3:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading