Jabardasth Avinash: జబర్దస్త్ అవినాష్‌కు బిగ్ బాస్‌లో ఎన్ని లక్షలు ఇస్తున్నారో తెలుసా..?

Bigg Boss 4 Avinash: జబర్దస్త్, బిగ్ బాస్.. రెండూ రెండే. ఈ రెండు షోలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకటి మస్త్ మస్త్ కామెడీ షో.. మరొకటి అదిరిపోయే రియాలిటీ షో.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 21, 2020, 2:45 PM IST
Jabardasth Avinash: జబర్దస్త్ అవినాష్‌కు బిగ్ బాస్‌లో ఎన్ని లక్షలు ఇస్తున్నారో తెలుసా..?
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
  • Share this:
జబర్దస్త్, బిగ్ బాస్.. రెండూ రెండే. ఈ రెండు షోలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒకటి మస్త్ మస్త్ కామెడీ షో.. మరొకటి అదిరిపోయే రియాలిటీ షో. అందుకే ఈ రెండు షోల్లో ఉన్న కంటెస్టెంట్స్‌కు కూడా మంచి ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటినీ మిక్స్ చేసారు నిర్వాహకులు. జబర్దస్త్ లాంటి క్రేజీ షో నుంచి అవినాష్ లాంటి టాప్ కమెడియన్‌ను బిగ్ బాస్‌కు తీసుకొచ్చారు. అక్కడే ఆయనకు మంచి పారితోషికం వస్తుంది. పైగా అవినాష్ టీం లీడర్ కూడా. దాంతో మల్లెమాల మంచి రెమ్యునరేషన్ ఇస్తుంది.
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)


అలాంటి అవినాష్ జబర్దస్త్‌కు బ్రేక్ ఇచ్చి మరీ బిగ్ బాస్‌కు వచ్చాడంటే ఆయనకు అంతకు మించి ఇచ్చుండాలి.. లేదంటే ఎందుకొస్తాడు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అవినాష్ ఊహించిన దానికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి ఈయన్ని బిగ్ బాస్‌కు తీసుకొచ్చారు నిర్వాహకులు. పైగా పారితోషికం విషయంలో ఎలాంటి సమస్యా లేదని తొలివారం ఎలిమినేట్ అయిన దర్శకుడు సూర్యకిరణ్ క్లారిటీ ఇచ్చాడు. తను అనుకున్న దానికంటే కూడా పదిరెట్లు ఎక్కువ ఇచ్చారని క్లారిటీ ఇచ్చాడు.
బిగ్ బాస్ 4లో అవినాష్ ఎంట్రీ (bigg boss 4 avinash)
బిగ్ బాస్ 4లో అవినాష్ ఎంట్రీ (bigg boss 4 avinash)

ఈ క్రమంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కు కూడా భారీ పారితోషికం ఆఫర్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటి సభ్యుల్లో అందరికంటే ఎక్కువగా లాస్యకు ఇస్తున్నారని తెలుస్తుంది. ఆమెకు రోజుకు దాదాపు 50 వేలు ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువే అని ప్రచారం కూడా ఉంది. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్, దేత్తడి హారిక లాంటి వాళ్లు ఉన్నారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకోడానికి అవినాష్ వచ్చేసాడని తెలుస్తుంది.
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

దాదాపు లాస్యతో సమానంగా ఈయనకు పారితోషికం అందుతుందని విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. లాస్యకు రోజుకు 50 వేల కంటే పైనే అందుతుంది. ఈ లెక్కన అవినాష్ కూడా 50 నుంచి 60 వేల మధ్యలో రోజుకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడన్నమాట. పైగా ఇప్పట్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు కూడా లేవు. ఎందుకంటే వచ్చిన రోజే ఫుల్ ఎంటర్‌టైన్ చేసాడు అవినాష్. పైగా షోకు క్రేజ్ ఉండాలంటే ఇలాంటి ఇమేజ్ ఉన్న వాళ్లు కూడా అవసరమే.
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)

దాంతో ఎలా చూసుకున్నా కూడా అవినాష్ మరో 10 వారాలు అయితే కచ్చితంగా ఉంటాడని అంచనా. ఆ లెక్కన 70 రోజులు.. అంటే అటూ ఇటూగా బిగ్ బాస్ నుంచి 35 లక్షలకు పైగానే అందుకుంటున్నాడు అవినాష్. జబర్దస్త్‌లో ఎన్ని స్కిట్స్ చేస్తే ఇంత డబ్బు వస్తుంది అనే వాళ్లు కూడా లేకపోలేదు. పైగా బిగ్ బాస్ షోకు వస్తే క్రేజ్ బాగానే పెరుగుతుంది కూడా. మళ్లీ వచ్చిన తర్వాత హాయిగా జబర్దస్త్ చేసుకుంటాడు. అలా తన కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుని బిగ్ బాస్ వైపు అడుగులేసాడు ముక్కు అవినాష్.
Published by: Praveen Kumar Vadla
First published: September 21, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading