BIGG BOSS 4 TELUGU JABARDASTH COMEDIAN AVINASH BEGGING AND ASKING FOR SAVE THIS WEEK FROM ELIMINATION PK
Bigg Boss 4 Telugu: తనను సేవ్ చేయమని కాళ్లు పట్టుకుని బతిమాలిన అవినాష్..
బిగ్ బాస్ అవినాష్ (Image: StarMAA)
Bigg Boss 4 Telugu: ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు బయటికి వెళ్లిపోతున్నారనే ప్రశ్నకు మరో అనుమానం లేకుండా అవినాష్ అనే సమాధానమే వస్తుంది. ముందు నుంచి కూడా ఈయనపైనే అందరి కన్ను ఉంది.
ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎవరు బయటికి వెళ్లిపోతున్నారనే ప్రశ్నకు మరో అనుమానం లేకుండా అవినాష్ అనే సమాధానమే వస్తుంది. ముందు నుంచి కూడా ఈయనపైనే అందరి కన్ను ఉంది. నిజానికి గత వారమే ఎలిమినేట్ అయిపోయినా కూడా చివరి నిమిషంలో బిగ్ బాస్ ఇచ్చిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఆధారంగా మనోడు బతికిపోయాడు. అయితే ఈ వారం మాత్రం అలాంటి బంపర్ ఆఫర్స్ ఏం కనిపించడం లేదు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో అఖిల్ ఇప్పటికే సేవ్ అయ్యాడు. మనోడు రేస్ టూ ఫినాలే టికెట్ కూడా దక్కించుకున్నాడు కాబట్టి ఇంకపై నామినేషన్స్ కూడా లేవు. హాయిగా కూర్చుని జరిగే డ్రామా చూస్తుంటాడంతే. ఇదిలా ఉంటే అభిజీత్ సేవ్ కావడం లాంఛనమే. ఆయనతో పాటు హారికకు కూడా మంచి సపోర్ట్ ఉంది. దాంతో ఈ ఇద్దరూ ఈజీగానే ఈ వారం సేఫ్ అయిపోతారు. మోనాల్ గజ్జర్ బయటికి వచ్చేస్తుందనే వార్తలు బాగానే వచ్చినా కూడా చివరి నిమిషంలో ఈమె సేవ్ అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. దాంతో అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు.
అయితే ఇప్పుడు విడుదలైన ప్రోమోలో మాత్రం అవినాష్ తనను సేవ్ చేయమని కాళ్లు పట్టుకుని బతిమిలాడాడు. ఎప్పట్లాగే నామినేషన్స్‌లో ఉన్న వాళ్లకు ఓ ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. అక్కడున్న కామధేనును మెప్పిస్తే మీరు సేవ్ అయిపోతారని చెప్పాడు. దాంతో అభిజీత్, హారిక, మోనాల్ ఎలా ట్రై చేసినా.. అవినాష్ మాత్రం కాళ్లు పట్టుకున్నాడు. దయచేసి తనను సేవ్ చేయాలంటూ వేడుకున్నాడు. ఇంత చేసినా కూడా అవినాష్ కలలు తీరినట్లు కనిపించడం లేదు. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చి చివరి వరకు నిలబడినా కూడా టాప్ 5లోకి మాత్రం రాలేకపోయాడు జబర్దస్త్ కమెడియన్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.