Bigg Boss 4 Telugu: సెంటిమెంట్ వర్కవుట్ అయితే బిగ్ బాస్ 4 విన్నర్‌ ఆ భామే..

Bigg Boss 4 Telugu: సినిమా ఇండస్ట్రీలో కానీ బుల్లితెరపై కానీ సెంటిమెంట్స్ చాలా బలంగా నమ్ముతుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 విషయంలో కూడా ఓ సెంటిమెంట్‌ను ఇలాగే బలంగా నమ్ముతున్నారు అభిమానులు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 25, 2020, 10:43 PM IST
Bigg Boss 4 Telugu: సెంటిమెంట్ వర్కవుట్ అయితే బిగ్ బాస్ 4 విన్నర్‌ ఆ భామే..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో (Photo : Twitter)
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో కానీ బుల్లితెరపై కానీ సెంటిమెంట్స్ చాలా బలంగా నమ్ముతుంటారు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4 విషయంలో కూడా ఓ సెంటిమెంట్‌ను ఇలాగే బలంగా నమ్ముతున్నారు అభిమానులు కూడా. అసలే ఇప్పుడు బిగ్ బాస్ దుమ్ము దులిపేస్తుంది. పైగా హౌజ్ మేట్స్ కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫిజికల్ టాస్కులు కూడా మీద పడి మరీ కొట్టేసుకుంటున్నారు. బయటికి వస్తే రప్ఫాడిస్తామంటూ ఓపెన్ వార్నింగులు కూడా ఇస్తున్నారు. ఈ సారి ఇంట్లో ఫేమ్ తక్కువగా ఉన్న కంటెస్టెంట్స్ వచ్చినా.. ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్లు చేస్తున్న రచ్చతో బాగా పాపులర్ అవుతున్నారు.
bigg boss 4 telugu (బిగ్ బాస్ 4 తెలుగు)
bigg boss 4 telugu (బిగ్ బాస్ 4 తెలుగు)


అరియానా గ్లోరీ, సోహైల్, మెహబూబ్ లాంటి వాళ్లు ముందు ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల ఓవర్ యాక్షన్‌తో ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. మరోవైపు దేత్తడి హారిక, అభిజీత్, మోనాల్ గజ్జర్, గంగవ్వ లాంటి వాళ్లు ముందు నుంచి ఆడియన్స్‌కు తెలుసు. వాళ్లు అంచనాలకు తగ్గట్లుగానే గేమ్ ఆడుతున్నారు కూడా. ఈ సారి ఎవరు విజేతగా నిలుస్తారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ముగ్గురు నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయితే కనిపిస్తున్నారు. అభిజీత్, గంగవ్వ, దేత్తడి హారిక లాంటి వాళ్లు అందులో ముందు వరసలో ఉన్నారు.
దేత్తడి హారిక(Dethadi Harika)
దేత్తడి హారిక(Dethadi Harika)

అయితే ఓ సెంటిమెంట్ మాత్రం ఇప్పుడు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. అది కానీ వర్కవుట్ అయితే ఈ సారి సీజన్ విన్నర్‌గా దేత్తడి పాప హారిక నిలుస్తుందని నమ్ముతున్నారు. అంతగా వాళ్లు ఫిదా అవుతున్న సెంటిమెంట్ ఏంటబ్బా అనుకుంటున్నారా..? ఏం లేదు.. చాలా సింపుల్ ఫేక్ ఎలిమినేషన్. గత సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్‌ను ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రేట్ రూమ్‌లో దాచేసి మూడు రోజుల తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చారు. అప్పుడు అభిమానులంతా షాక్ అయ్యారు. రాహుల్ ఎలిమినేట్ కావడం ఏంటి అనుకున్నారు.. చివరికి ఆయనే విన్నర్ అయ్యాడు.
bigg boss 4 telugu (బిగ్ బాస్ 4 తెలుగు)
bigg boss 4 telugu (బిగ్ బాస్ 4 తెలుగు)

ఇప్పుడు హారిక కూడా ఫేక్ ఎలిమినేట్ అయింది.. మళ్లీ ఇంటికి వచ్చింది. దాంతో ఇదే సెంటిమెంట్ రిపీట్ అయితే హారిక ఇంటి విన్నర్ అవుతుందని చెప్తున్నారు దేత్తడి ఆర్మీ. మరి ఈమె కోరిక నెరవేరుతుందా.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా చూడాలి. ఒకవేళ అదే కానీ జరిగితే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో విజేతగా నిలిచిన తొలి అమ్మాయి అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ శివ బాలాజీ.. రెండో సీజన్ కౌశల్.. మూడో సీజన్ రాహుల్ సిప్లిగంజ్ విజేతలుగా నిలిచారు. గీతా మాధురి, శ్రీముఖి లాంటి వాళ్లు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. అందుకే ఈ సారి హారిక చరిత్ర తిరగరాస్తుందేమో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: September 25, 2020, 10:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading