Home /News /movies /

BIGG BOSS 4 TELUGU HOW MUCH REMUNERATION TAKEN BY NAGARJUNA AKKINENI AND HERE THE DETAILS PK

Bigg Boss 4 Nagarjuna remuneration: బిగ్ బాస్ 4 కోసం నాగార్జున అందుకున్న రెమ్యునరేషన్ ఎంత..?

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే (Bigg Boss 4 Telugu Nagarjuna)

బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే (Bigg Boss 4 Telugu Nagarjuna)

Bigg Boss 4 Nagarjuna remuneration: 106 రోజుల బిగ్ బాస్ షో కొన్ని గంటల కిందే ముగిసింది. మొదట్లో మంచి రేటింగ్స్ తెచ్చుకున్న ఈ షో.. తర్వాత మాత్రం చల్లబడింది. ఎందుకో తెలియదు కానీ ఈ షో రేటింగ్స్ తగ్గుతూ వచ్చాయి.

106 రోజుల బిగ్ బాస్ షో కొన్ని గంటల కిందే ముగిసింది. మొదట్లో మంచి రేటింగ్స్ తెచ్చుకున్న ఈ షో.. తర్వాత మాత్రం చల్లబడింది. ఎందుకో తెలియదు కానీ ఈ షో రేటింగ్స్ తగ్గుతూ వచ్చాయి. నాగార్జున కూడా హోస్టుగా మొదట్లో ఆకట్టుకున్నా కూడా మధ్యలో కొన్నిసార్లు నిర్వాహకుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మళ్లీ గాడిన పడ్డాడు. అయితే కొన్నిసార్లు ఎపిసోడ్స్ చూడకుండానే అక్కడున్న వాళ్లను జడ్జ్ చేయడం.. కొన్నిసార్లు తప్పుడు తీర్పు కూడా ఇవ్వడంతో నాగార్జునపై ఎందుకో తెలియని నెటిటివ్ ఫీలింగ్ వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయపడుతున్నారు. కుమార్ సాయి, దేవి నాగవల్లి లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినపుడు నాగ్ ఏం చేయలేకపోయాడనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఈ షో చేసినందుకు గానూ నాగార్జునకు భారీగానే రెమ్యునరేషన్ అందిందని తెలుస్తుంది. ఈ షో కోసం సినిమాలకు కూడా దూరంగానే ఉన్నాడు నాగ్. 30 ఎపిసోడ్స్‌కు అగ్రిమెంట్ చేసుకున్నా కూడా మధ్యలో రెండు ఎపిసోడ్లకు దూరం అయ్యాడు నాగార్జున.
bigg boss 4 telugu,bigg boss 4 telugu nagarjuna,bigg boss 4 telugu nagarjuna remuneration,bigg boss 4 telugu nagarjuna remuneration 7 crores,nagarjuna remuneration 7 crores,నాగార్జున,బిగ్ బాస్ 4 తెలుగు నాగార్జున రెమ్యునరేషన్,నాగార్జున 7 కోట్ల పారితోషికం
బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)

అయినా కూడా ఎలాంటి కట్స్ లేకుండా ఆయన ఫుల్ రెమ్యునరేషన్ స్టార్ మా అతడి చేతుల్లో పెట్టిందని తెలుస్తుంది. ఈ షో కోసం 7 కోట్ల పారితోషికాన్ని నాగార్జున తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో నానితో సమానంగా ఎన్టీఆర్ కంటే వెనకాల ఉన్నాడు నాగార్జున. ఎన్టీఆర్ కేవలం 13 ఎపిసోడ్లకే అప్పట్లో 8 కోట్ల వరకు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక నాని కూడా 7 కోట్ల వరకు తీసుకున్నాడు.
bigg boss 4 telugu,bigg boss 4 telugu nagarjuna,bigg boss 4 telugu nagarjuna remuneration,bigg boss 4 telugu nagarjuna remuneration 7 crores,nagarjuna remuneration 7 crores,నాగార్జున,బిగ్ బాస్ 4 తెలుగు నాగార్జున రెమ్యునరేషన్,నాగార్జున 7 కోట్ల పారితోషికం
బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4 Telugu)

ఇప్పుడు నాగార్జున కూడా నానితో సమానంగా తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య నాగార్జున తన వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం ఓ ఎపిసోడ్ దూరం కావడం.. సమం రావడం జరిగాయి. ఈ షో విజేత అభిజీత్ 25 లక్షలు గెలుచుకోగా.. మూడోస్థానంలో నిలిచిన సోహెల్ మాత్రం 25 లక్షలతో పాటు మరిన్ని డబ్బులు కూడా అందుకున్నాడు. ఏదేమైనా కూడా భారీగానే నాగార్జున ఈ సారి పారితోషికం అందుకున్నాడు. వచ్చే సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలిక.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Nagarjuna Akkineni, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు