Bigg Boss 4 Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీలో అరాచకం.. తిరగబడిన హౌజ్‌మేట్స్..

Bigg Boss 4 Amma Rajasekhar: బిగ్ బాస్ 4 తెలుగులో అమ్మ రాజశేఖర్ తీరు ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. మొన్నటి వారం ఆయన ఎలిమినేట్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో బయటపడ్డాడు. నోయల్ కారణంగా ఈయన్ని బయటికి వెళ్లకుండా ఆపేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 6, 2020, 6:16 PM IST
Bigg Boss 4 Amma Rajasekhar: అమ్మ రాజశేఖర్ కెప్టెన్సీలో అరాచకం.. తిరగబడిన హౌజ్‌మేట్స్..
అమ్మ రాజశేఖర్ (amma rajasekhar)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో అమ్మ రాజశేఖర్ తీరు ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. మొన్నటి వారం ఆయన ఎలిమినేట్ కావాల్సి ఉండగా చివరి నిమిషంలో బయటపడ్డాడు. నోయల్ కారణంగా ఈయన్ని బయటికి వెళ్లకుండా ఆపేసారు. దాంతో పాటు ఈ వారం నేరుగా కెప్టెన్సీ పోటీదారుగా నాగార్జున నియమించాడు. అదృష్టం బాగుండి ఈ వారం కెప్టెన్ కూడా అయ్యాడు అమ్మ. దాంతో మనోడు ఇన్నాళ్లుగా దాచుకున్న ఫ్రస్టేషన్‌ను బయటికి తీసుకొచ్చాడు. ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నాడు. ముఖ్యంగా అభి అండ్ గ్యాంగ్‌తో ఆడుకోవాలని చూస్తున్నాడు అమ్మ. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైందిప్పుడు. అందులో అభిజీత్, హారికతో అమ్మ రాజశేఖర్ గొడవ పడటమే హైలైట్ అవుతుంది. అమ్మ చెప్పిన దానికి అభిజీత్, హారికతో పాటు సోహైల్ కూడా అడ్డు చెప్పాడు. మీరు చెప్పింది నేను చేయను అంటూ ఎదురుతిరిగాడు. మరోవైపు అమ్మ రాజశేఖర్ మాత్రం తన కెప్టెన్సీలో ఇంతే.. మీ యిష్టమొచ్చినట్లు ఉంటానంటే కుదరదు అంటూ ఆర్డర్స్ వేసాడు.

దాంతో ఇంటి సభ్యులకు అమ్మకు పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఈ వారం అమ్మ రాజశేఖర్ నామినేషన్స్‌లో ఉన్నాడు. ఈయన డేంజర్‌ జోన్‌లో కూడా ఉన్నాడు. అయినా కూడా అదృష్టం కలిసొచ్చి కెప్టెన్ అయ్యాడు. ఒకవేళ ఈ వారం సేఫ్ అయితే నెక్ట్స్ వీక్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. అలా కాదని ఈ వారమే వెళ్లిపోతే మాత్రం చేసేదేం ఉండదు. కానీ ఇన్ని రోజులుగా తనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను పూర్తిగా బయటికి తీసుకొచ్చాడు. ఎవరినైతే తాను ఇబ్బంది పెట్టాలనుకున్నాడో వాళ్లను ఆడుకుంటున్నాడు ఈయన. అరియానా, అవినాష్‌తో మాత్రమే అమ్మ బాగున్నాడు. దాంతో వాళ్లను ఏం టార్గెట్ చేయలేదు. మరోవైపు మోనాల్‌ను కూడా అలాగే ట్రీట్ చేసాడు అమ్మ రాజశేఖర్. ఏదేమైనా కూడా అమ్మ కెప్టెన్సీలో మాత్రం అరాచకాలు చాలానే జరుగుతున్నాయి. మరి దీని ముగింపు ఎలా ఉండబోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: November 6, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading