Home /News /movies /

BIGG BOSS 4 TELUGU HOST NAGARJUNA AKKINENI REVEALED THAT HOW MANY CRORE VOTES FOR SEASON 4 FINALE PK

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ ఫినాలేకు ఎన్ని కోట్ల ఓట్లు పోల్ అయ్యాయో తెలిస్తే షాక్ తప్పదు..

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే (Image:StarMAA)

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే (Image:StarMAA)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో అదిరిపోయే డాన్సులు, పాటలతో ఎపిసోడ్ మొదలైంది. ఫినాలే ఎపిసోడ్ మొదలైన తీరు చూసి ఎలా ఉండబోతుందో..

బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే ఎపిసోడ్ అంగరంగ వైభవంగా మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన సెట్‌లో అదిరిపోయే డాన్సులు, పాటలతో ఎపిసోడ్ మొదలైంది. ఫినాలే ఎపిసోడ్ మొదలైన తీరు చూసి ఎలా ఉండబోతుందో అర్థమైపోయింది కూడా. ముఖ్యంగా వచ్చీ రావడంతోనే నాగార్జున అదిరిపోయే డాన్సులు చేసాడు. దానికితోడు మిగిలిన వాళ్లు కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సీజన్ కంటెస్టెంట్స్ అంతా స్టేజీపై దుమ్ము దులిపేసారు. మెహబూబ్ దిల్ సే స్టెప్పులతో కుమ్మేసాడు. ప్రభుదేవా పాటతో అదరగొట్టాడు మెహబూబ్. ఆ తర్వాత హాట్ హాట్ డాన్సులతో మోనాల్ గజ్జర్, దివి పిచ్చెక్కించారు. నడుము సోయగాలతో దివి మాయ చేస్తే.. ఎద పొంగులతో పిచ్చెక్కించింది మోనాల్. ఈ ఇద్దరి డాన్సులకు స్టేజీ అంతా హీట్ ఎక్కిపోయింది. కుమార్ సాయి, గంగవ్వ ఒకేసారి స్టేజీపైకి వచ్చారు. ఇక స్వాతి దీక్షిత్ కూడా మాంచి మసాలా సాంగ్ చేసింది. కరాటే కళ్యాణి అయితే నాది నకిలీసు గొలుసు అంటూ రెచ్చిపోయింది. ఈమెతో పాటు పిచ్చెక్కించింది స్వాతి. వాళ్లకంటే ముందే అమ్మ రాజశేఖర్ రావణా అంటూ వచ్చాడు.
bigg boss 4 telugu,bigg boss 4 telugu finale,bigg boss 4 telugu finale votes,bigg boss 4 telugu finale voting,bigg boss 4 telugu votes,bigg boss 4 telugu nagarjuna host,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగు ఓట్స్,బిగ్ బాస్ 4 తెలుగు 15 కోట్ల ఓట్లు
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu/Youtube)

చాలా రోజుల తర్వాత డాన్స్ చేసాడు ఈయన. ఫ్యామిలీ పార్టీ అంటూ అవినాష్ ముచ్చటగా వచ్చాడు. గోల గోల చేస్తూ బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ మొదలైంది. మరోవైపు ఈ సీజన్ ఎన్ని కోట్ల ఓట్లు వచ్చాయో షో మొదలైన వెంటనే చెప్పాడు నాగార్జున. సీజన్ 3లో 8 కోట్ల ఓట్లు పోలైతే.. ఈ సారి మాత్రం దానికి డబుల్ వచ్చాయి. సీజన్ 4లో ఫినాలే కోసం 15 కోట్ల 65 లక్షల ఓట్లు పోలైనట్లు చెప్పి షాక్ ఇచ్చాడు నాగార్జున. రెండింతలు కావడంతో షో సూపర్ సక్సెస్ అంటూ మురిసిపోయాడు నాగార్జున. పైగా లాక్ డౌన్, కరోనా కావడంతో ఓట్ల సంఖ్య మరింత పెరిగిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు