Bigg Boss 4: ఈ వారం బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయిన్‌‌..

Bigg Boss 4 Telugu | తెలుగు ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎపుడెపుడా అని ఎదురు చూసిన బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభం అయింది. ఇప్పటికే ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వగా ఈ సారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: September 20, 2020, 3:45 PM IST
Bigg Boss 4: ఈ వారం బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న క్రేజీ హీరోయిన్‌‌..
బిగ్ బాస్ తెలుగు 4 లోగో (Photo : Twitter)
  • Share this:
Bigg Boss 4 Telugu | తెలుగు ప్రేక్షకులు గత కొన్ని రోజులుగా ఎపుడెపుడా అని ఎదురు చూసిన బిగ్‌బాస్ 4 సీజన్ ప్రారంభం అయింది. బిగ్‌బాస్ మొదటిసారి ప్రసారమైపుడే ఎక్కువ మంది సెలబ్రిటీలు హౌస్‌లో ఉన్నారు. రాను రాను బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపెట్టడం లేదు. దీంతో ఉన్నంతలో అంతో ఇంతో క్రేజ్ ఉన్న వాళ్లను బిగ్‌బాస్ 4 కోసం తీసుకున్నారు. ఫస్ట్ వీక్.. దర్శకుడు సూర్య కిరణ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత నిన్న కరాటే కళ్యాణి కూడా బిగ్‌బాస్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే షో ప్రారంభ‌మైన వారం రోజులకే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు వైల్డ్ కార్డ్ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీశారు. అందులో భాగంగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా “ఈరోజుల్లో” బస్టాప్ ఫేమ్ సాయి కుమార్ హౌజ్’లోకి వచ్చాడు.ఇప్పుడు జబర్దస్త్ ముక్కు అవినాష్ ఎంట్రీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇద్దరు ఎగ్జిట్ ఇచ్చారు. ఇద్దరు ఎంట్రీ ఇవ్వడంతో అంతా లెవల్ అయిపోయింది. ఈ రోజు మరో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ వారం మరో సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

Bigg Boss 4 Telugu heroine swathi deekshith to entry in bigg ooss house through wild card entry, Bigg boss telugu 4,bigg boss telugu,bigg boss telugu,swathi deekshith,swathi deekshith wild card entry,swathi deekshith wild card entry into bigg boss 4,Bigg boss telugu 4, wild card entry,Bigg boss telugu 4 swathi deekshith sai kumar mukku avinash,bigg boss show,bigg boss episode,gangavva,bigg boss gangavva,my village show bigg boss,tollywood,telugu cinema,బిగ్ బాస్ 4 తెలుగు, బిగ్ బాస్,గంగవ్వ,బిగ్ బాస్ గంగవ్వ,స్వాతి దీక్షిత్,బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న స్వాతి దీక్షిత్
స్వాతి దీక్షిత్ (Twitter/Photo)


ఆమె ఎవరంటే.. అల్లరి నరేష్ జంప్ జిలానీలో హీరోయిన్‌గా నటించిన స్వాతి దీక్షిత్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. మరి ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‌బాస్‌లో ఏమైనా ఈక్వెషన్స్ మారుతాయా అనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading