Bigg Boss 4 Telugu: అవినాష్‌పై నోయల్ ఆరోపణల వెనక అంత పెద్ద కథ ఉందా..?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగులో నోయల్ ఎలిమినేట్ అయిపోయాడు. అనారోగ్యం కారణంగా ఆయన బయటికి వెళ్లిపోయాడు. తన కెరీర్ కంటే బిగ్ బాస్ ముఖ్యం కాదని చెప్పి వెళ్లిపోయాడు ఈయన. అయితే వెళ్తూ వెళ్తూ అవినాష్, అమ్మ రాజశేఖర్‌..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 31, 2020, 11:00 PM IST
Bigg Boss 4 Telugu: అవినాష్‌పై నోయల్ ఆరోపణల వెనక అంత పెద్ద కథ ఉందా..?
అవినాష్ నోయల్ అమ్మ రాజశేఖర్ (avinash amma noel)
  • Share this:
బిగ్ బాస్ 4 తెలుగులో నోయల్ ఎలిమినేట్ అయిపోయాడు. అనారోగ్యం కారణంగా ఆయన బయటికి వెళ్లిపోయాడు. తన కెరీర్ కంటే బిగ్ బాస్ ముఖ్యం కాదని చెప్పి వెళ్లిపోయాడు ఈయన. అయితే వెళ్తూ వెళ్తూ అవినాష్, అమ్మ రాజశేఖర్‌పై ఈయన చేసిన కామెంట్స్ మాత్రం సీరియస్ అయ్యాడు.. సంచలనం సృష్టించాయి. ఎప్పుడూ శాంతంగా కనిపించే నోయల్ ఒక్కసారిగా అంత సీరియస్ అయ్యేసరికి అంతా షాక్ అయ్యారు. లోపల నుంచి ఏదో అపరిచితుడు బయటికి వచ్చినట్లు మాట్లాడేసాడు నోయల్. అయితే దీనివెనక కూడా గేమ్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇంట్లో ఉన్నంత కాలం సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు నోయల్. ఎవర్నీ నొప్పించకుండా తన ఆట తాను ఆడేసాడు. అయితే బయటికి వచ్చిన తర్వాత ఉన్నదున్నట్లు కుండ బద్ధలు కొట్టేసి సంచలనం రేపాడు. ముఖ్యంగా అవినాష్, అమ్మపై నోయల్ సీరియస్ అయిన విధానం మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది. ఇంట్లో ఉన్నపుడు కూర్చుని నవ్వుకుని బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా అంత రివర్స్ కావడం ప్రేక్షకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

bigg boss 4 telugu,bigg boss 4 telugu noel,bigg boss 4 telugu noel avinash amma rajasekhar,bigg boss 4 telugu noel allegations on avinash amma rajasekhar,bigg boss 4 telugu noel sean elimination,telugu cinema,bigg boss 4 telugu latest promo,అమ్మ రాజశేఖర్ అవినాష్‌పై నోయల్ సీరియస్,నోయల్ బిగ్ బాస్ 4 తెలుగు,అవినాష్ అమ్మకు నోయల్ సీరియస్ వార్నింగ్
అవినాష్ నోయల్ అమ్మ రాజశేఖర్ (avinash amma noel)


నోయల్‌లో ఉన్న ఇంకో మనిషిని చూసి వామ్మో అనుకుంటున్నారు. అంటే ఇంట్లో ఉన్నపుడు గేమ్ ఆడాడా.. నాటకాలు ఆడాడా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇన్నాళ్లూ గేమ్ కోసం ముసుగు వేసుకున్నాడేమో అనేంతగా నోయల్ రెచ్చిపోయాడు. అయితే ఇక్కడే అసలు స్టోరీ కూడా ఉంది. ఇంట్లో లాస్య, అభిజీత్, హారిక మంచి స్నేహితులు. వీళ్లకు నోయల్ కూడా అంతే మంచి స్నేహితుడు. వాళ్లను సేవ్ చేయడానికి.. హైలైట్ చేయడానికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన అవినాష్‌పై మాట అనేసి వెళ్తున్నాడంటూ సోషల్ మీడియాలో అప్పుడే నోయల్‌పై కౌంటర్ మొదలైంది.

bigg boss 4 telugu,bigg boss 4 telugu noel,bigg boss 4 telugu noel avinash amma rajasekhar,bigg boss 4 telugu noel allegations on avinash amma rajasekhar,bigg boss 4 telugu noel sean elimination,telugu cinema,bigg boss 4 telugu latest promo,అమ్మ రాజశేఖర్ అవినాష్‌పై నోయల్ సీరియస్,నోయల్ బిగ్ బాస్ 4 తెలుగు,అవినాష్ అమ్మకు నోయల్ సీరియస్ వార్నింగ్
నోయల్, లాస్య (Image:StarMaa)


తన స్నేహితులు గ్రేట్ అని చెప్పుకోడానికి మరో కంటెస్టెంట్‌ను బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అక్కడ నోయల్ చేసింది తప్పా రైటా అనేది పక్కన బెడితే వెళ్తూ వెళ్తూ ఈయన చేసింది మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. మరి తన ముగ్గురు స్నేహితుల కోసం నోయల్ చేసిన ఈ పని వాళ్లకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: October 31, 2020, 11:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading