Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 24, 2020, 3:19 PM IST
హారిక మోనాల్ గజ్జర్ (Harika Monal Gajjar)
పొట్టివాళ్లు మహా గట్టివాళ్లు అంటారు కదా.. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ హారికను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఆమెను ఇంట్లో అంతా సరదాగా పొట్టి అని వెక్కిరిస్తుంటారు. కానీ చాలా గట్టి అని మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ముందు ఈమె ఇంట్లోకి వచ్చినపుడు అభిజీత్‌కు డూప్‌లా మారిపోయింది.. ఆయన నీడలోనే ఆడుతుందనే విమర్శలు వచ్చాయి. అయితే మెల్లగా తన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది హారిక. ఇప్పుడు 12వ వారంలో కెప్టెన్ అయింది. ఇమ్యూనిటీ కూడా సాధించుకుంది. అయితే అదే కెప్టెన్సీ పవర్ వాడి తన స్నేహితుడిని కూడా సేవ్ చేసుకుంది హారిక. తను కెప్టెన్ కావడానికి సాయపడిన మోనాల్ గజ్జర్‌నే ఇప్పుడు నామినేట్ చేసి సంచలనం రేపింది ఈ భామ. అయితే దాని వెనక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ కొన్ని వింతలు చేసాడు. ఒకర్ని ఒకరు తిట్టుకునేది పక్కనబెట్టి సింపుల్‌గానే వాళ్ల నెత్తిపైనే టోపీ పెట్టి మీ అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు.

బిగ్ బాస్ 4 తెలుగు (monal akhil abijeet)
అందులో సోహైల్, మోనాల్ అదృష్టవంతులు అయితే అవినాష్, అఖిల్, అభిజీత్, అరియానా నామినేట్ అయ్యారు. కానీ మోనాల్ అదృష్టాన్ని దగ్గరుండి లాగేసుకుంది హారిక. తన కెప్టెన్సీ పవర్‌తో అభిని సేవ్ చేసి మోనాల్‌ను నామినేట్ చేసింది. కానీ అలా ఆమె చేయడం వెనక ఓ కథ ఉంది. ప్రతీవారం అభిజీత్, హారికలలో ఎవరో ఒకరు కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటారు. వీకెండ్లో సేవ్ అవుతున్నారు. హౌజ్‌లో అందరికంటే ఎక్కువసార్లు నామినేట్ అయింది ఈ ఇద్దరే.

మోనాల్‌తో అభిజీత్ Photo : Star Maa
అయినా కూడా మంచి ఓట్లు పడుతున్నాయి. ఈ సారి ఇద్దరూ నామినేట్ కాలేదు. తన చేతిలో ఉన్న పవర్ వాడి అభిని కూడా బయటికి తీసుకొచ్చింది హారిక. కానీ అదే స్థానంలో మోనాల్‌ను నిలబెట్టింది. ఈ సారి తామిద్దరం నామినేట్ కాలేదు కాబట్టి కచ్చితంగా తమ సపోర్టర్స్ అంతా మోనాల్ గజ్జర్‌కు ఓట్లు వేస్తారని నమ్ముతుంది హారిక. కచ్చితంగా వాళ్ల సపోర్ట్‌తోనే బయటికి వస్తావని చెప్తుంది కూడా. కానీ అంతలోనే బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన వాళ్లకు సేవ్ కావడానికి మరో ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి అందులో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఇంట్లో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుంది.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 24, 2020, 3:19 PM IST