Home /News /movies /

BIGG BOSS 4 TELUGU HARIKA ELIMINATED FIRST FROM TOP 5 CONTESTANTS PK

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలేలో తొలి ఎలిమినేషన్.. అందరూ ఊహించిందే..

దేత్తడి హారిక (Instagram/Photo)

దేత్తడి హారిక (Instagram/Photo)

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే ఎపిసోడ్ జోరుగా జరుగుతుంది. ఎవరు ఉంటున్నారు.. ఎవరు వెళ్తున్నారని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోకి వెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే కామెడీ..

బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే ఎపిసోడ్ జోరుగా జరుగుతుంది. ఎవరు ఉంటున్నారు.. ఎవరు వెళ్తున్నారని అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఇంట్లోకి వెళ్లిన సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అదిరిపోయే కామెడీ కూడా చేస్తున్నాడు. ఈయన్ని చూసి వారెవ్వా మనోడు నటుడా లేదంటే దర్శకుడా అంటూ షాక్ అవుతున్నారు. మనోడు చేసే కామెడీకి పిచ్చెక్కిపోయి నవ్వుతున్నారు ఆడియన్స్ కూడా. అంతలోనే నవ్విస్తూ నవ్విస్తూనే ఎలిమినేషన్ కూడా పూర్తి చేసారు. అనిల్ రావిపూడితో పాటు ఇంట్లోకి మెహ్రీన్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ కాసేపు ఇంట్లో ఉండి ఆ తర్వాత తొలి ఎలిమినేషన్ పూర్తి చేసారు. అందరూ ఊహించినట్లుగానే హారిక ఎలిమినేట్ అయిపోయింది. టాప్ 5లో తొలి ఎలిమినేటెడ్ కంటెస్టెంట్‌గా హారిక నిలిచింది. అందరి కళ్లకు గంతలు కట్టి.. అందులో ఒకర్ని ఎలిమినేట్ చేసారు. హారికను తీసుకుని ఫ్లై చేస్తూ పక్కనే ఉన్న బిగ్ బాస్ స్టేజీపైకి తీసుకొచ్చారు. వెళ్తూ అందరికీ కంగ్రాట్స్ చెప్పి.. ఆల్ ది బెస్ట్ చెప్పింది హారిక. టాప్ 5 కాస్తా టాప్ 4 అయిపోయారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు