Home /News /movies /

BIGG BOSS 4 TELUGU GRAND FINALE UPDATES HERE IS INTERESTING COMPARISION BETWEEN GEETHA MADHURI SRIMUKHI ARIYANA FULL DETAILS HERE MNJ

Bigg Boss 4: గీతా మాధురి, శ్రీముఖి, అరియానా...వీరి మధ్య ఈ పోలిక తెలుసా?

శ్రీముఖి గీతా మాధురి,అరియానా

శ్రీముఖి గీతా మాధురి,అరియానా

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ డే(Bigg Boss 4 Grand Finale) ఈ రోజు. 105 రోజుల పాటు సాగిన ఈ షోలో విజేత‌ను ఇవాళ ప్ర‌క‌టించ‌నున్నారు. అన్ని పోల్స్ ప్ర‌కారం అభిజీత్(Abijeet) విన్న‌ర్‌గా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    Bigg Boss 4 Grand Finale: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ డే ఈ రోజు. 105 రోజుల పాటు సాగిన ఈ షోలో విజేత‌ను ఇవాళ ప్ర‌క‌టించ‌నున్నారు. అన్ని పోల్స్ ప్ర‌కారం అభిజీత్ విన్న‌ర్‌గా నిలిచే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే సోష‌ల్ మీడియా లీక్స్‌ ప్ర‌కారం టాప్ 5లో అభిజీత్, అరియానా, సొహైల్‌, అఖిల్‌, హారిక‌లు ఉండ‌గా.. వీరిలో లేడి కంటెస్టెంట్లు ఇద్ద‌రు ఇప్ప‌టికే ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. మొద‌ట‌గా హారిక‌, త‌రువాత అరియానా ఎలిమినేట్ అయిన‌ట్లు స‌మాచారం. మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్ల మ‌ధ్య ప్ర‌స్తుతం పోటీ జ‌రుగుతున్న‌ట్లు టాక్‌. దీంతో ఈ సీజ‌న్ కూడా లేడి బిగ్‌బాస్ క‌ల క‌ల‌గానే మిగిలిన‌ట్లు స‌మాచారం.

    కాగా మొద‌టి సీజ‌న్ మిన‌హాయిస్తే.. రెండు, మూడు సీజ‌న్ల‌లోనూ ఇలానే జ‌రిగింది. రెండో సీజ‌న్‌లో పాల్గొన్న గీతా మాధురి, మూడో సీజ‌న్‌లో పాల్గొన్న శ్రీముఖి.. విజేత‌ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఇక ఈ సీజ‌న్‌లో విన్న‌ర్‌గా అభిజీత్ పేరు వినిపిస్తున్న‌ప్ప‌టికీ.. అరియానా పేరు కూడా లైన్‌లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే మూడు సీజ‌న్ల‌లో మేల్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా కావ‌డంతో ఈ సీజ‌న్ విన్న‌ర్‌గా మ‌ళ్లీ మేల్‌ని ప్ర‌క‌టిస్తే బిగ్‌బాస్‌పై నెగిటివ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, అందుకే అరియానాను ప్ర‌క‌టించ‌నున్నార‌ని టాక్ న‌డిచింది. ఇక కొన్ని పోలింగ్‌లోనూ అరియానా టాప్ 2లో కొన‌సాగింది.

    అయితే ఇప్పుడు అరియానా ఎలిమినేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇలా ముందు రెండు సీజ‌న్‌ల‌లో గ‌ట్టి పోటీ ఇచ్చి విన్న‌ర్ అవ్వ‌లేక‌పోయిన గీతా మాధురి, శ్రీముఖి స‌ర‌స‌న ఇప్పుడు అరియానా చేరనుంది. మ‌రి ఇందులో నిజ‌మెంత‌..? నిజంగానే అరియానా, హారిక ఎలిమినేట్ అయ్యారా..? అస‌లు ఈ సీజ‌న్ విన్న‌ర్ ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధానం తెలియాలంటే కొన్ని గంట‌లు ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published:

    Tags: Anchor srimukhi, Bigg Boss 4 Telugu, Geetha madhuri, Television News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు