హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఉండటం గంగవ్వకు ఇష్టం లేదా..?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ఉండటం గంగవ్వకు ఇష్టం లేదా..?

షాకింగ్ ఎలిమినేషన్: గంగవ్వ

షాకింగ్ ఎలిమినేషన్: గంగవ్వ

Bigg Boss 4 Gangavva: బిగ్ బాస్ సీజన్ మొత్తానికే స్పెషల్ కంటెస్టెంట్‌గా గంగవ్వను తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆమెకు సకల సౌకర్యాలు అందచేస్తున్నారు కూడా. అన్ని వసతులు కల్పించి ఇంట్లో ఉంచాడు..

బిగ్ బాస్ సీజన్ మొత్తానికే స్పెషల్ కంటెస్టెంట్‌గా గంగవ్వను తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆమెకు సకల సౌకర్యాలు అందచేస్తున్నారు కూడా. అన్ని వసతులు కల్పించి ఇంట్లో ఉంచాడు బిగ్ బాస్. అసలు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్‌కు ఇవ్వనంత మర్యాద, గౌరవం ఇచ్చాడు. అయితే ఇన్ని చేసినా గంగవ్వ చేష్టలు మాత్రం చిత్రంగా అనిపిస్తున్నాయి. ఈమెకు ఇంట్లో ఉండటం యిష్టం లేదా.. లేదంటే అక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతుందా అనేది అర్థం కావడం లేదు ఆడియన్స్‌కు.

నాగార్జున గంగవ్వ (nagarjuna gangavva)
నాగార్జున గంగవ్వ (nagarjuna gangavva)

తొలివారం ఈమెను నామినేషన్స్‌లోకి పంపిస్తే రికార్డ్ ఓటింగ్స్ వేసి ఆమెనే సేవ్ చేసారు ప్రేక్షకులు. సేఫ్ అయిన తర్వాత నాగార్జున ఈ సిచ్యువేషన్ గురించి అడిగితే తనకు ఇంట్లో ఉండటం నచ్చట్లేదన్నట్లు సమాధానం చెప్పింది. రెండు మూడు వారాల తర్వాత తానే బయటికి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చింది గంగవ్వ. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈమె. రెండోవారం కూడా నామినేషన్స్‌లోకి వెళ్లింది గంగవ్వ. పైగా అది కూడా సెల్ఫ్ నామినేషన్స్‌లోకి. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో భాగంగా తనకు తానుగా నామినేట్ అయింది గంగవ్వ.

గంగవ్వ (Twitter: StarMaa)

మిగిలిన కంటెస్టెంట్స్ అంతా చెప్పడంతో ఓకే అనేసి నామినేట్ అయింది ఈమె. మీరు నామినేషన్స్‌లోకి వెళ్లినా కూడా జనాలు మీకు ఓట్లేస్తారు అంటూ గంగవ్వను మిగిలిన వాళ్లు రెచ్చగొట్టడం.. దానికి ఆమె సరే అనడం చూస్తుంటే ప్రతీవారం నామినేషన్స్‌లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఏదో ఓ వారం గంగవ్వ జోరుకు బ్రేకులు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే రానురాను కచ్చితంగా పోటీ మరింత దారుణంగా ఉంటుంది. అందుకే గంగవ్వ ఎన్ని వారాలు ఇలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు