హోమ్ /వార్తలు /సినిమా /

Bigg Boss 4 Gangavva: బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఔట్.. గౌరవంగా పంపించిన నాగార్జున..

Bigg Boss 4 Gangavva: బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఔట్.. గౌరవంగా పంపించిన నాగార్జున..

నాగార్జున గంగవ్వ (nagarjuna gangavva)

నాగార్జున గంగవ్వ (nagarjuna gangavva)

Bigg Boss 4 Gangavva: అందరికీ నిజంగానే షాక్ ఇది.. ఈ వారం బిగ్ బాస్ నుంచి గంగవ్వ బయటికి వచ్చేసింది. నామినేషన్స్‌లో కూడా లేకుండా సొంతంగా బయటికి వచ్చేసింది గంగవ్వ. తను ఆరోగ్యం బాగోలేదని చెప్పి అభ్యర్థన పెట్టుకోవడంతో బిగ్ బాస్ ఒప్పుకున్నాడు.

ఇంకా చదవండి ...

అందరికీ నిజంగానే షాక్ ఇది.. ఈ వారం బిగ్ బాస్ నుంచి గంగవ్వ బయటికి వచ్చేసింది. నామినేషన్స్‌లో కూడా లేకుండా సొంతంగా బయటికి వచ్చేసింది గంగవ్వ. తను ఆరోగ్యం బాగోలేదని చెప్పి అభ్యర్థన పెట్టుకోవడంతో బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. గంగవ్వ బయటికి వస్తుందని ప్రోమోలోనే అర్థమైంది.. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయిపోయింది. గత వారం రోజులుగా గంగవ్వ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బిగ్ బాస్ సీజన్ మొత్తానికే స్పెషల్ కంటెస్టెంట్‌గా గంగవ్వను తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆమెకు సకల సౌకర్యాలు అందచేస్తున్నారు కూడా. అన్ని వసతులు కల్పించి ఇంట్లో ఉంచాడు బిగ్ బాస్. అసలు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్‌కు ఇవ్వనంత మర్యాద, గౌరవం ఇచ్చాడు. అయితే ఇన్ని చేసినా గంగవ్వ చేష్టలు మాత్రం చిత్రంగా అనిపిస్తున్నాయి. ఈమెకు ఇంట్లో ఉండటం యిష్టం లేదా.. లేదంటే అక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోతుందా అనేది అర్థం కావడం లేదు ఆడియన్స్‌కు. తొలి రెండు వారాలు ఈమెను నామినేషన్స్‌లోకి పంపిస్తే రికార్డ్ ఓటింగ్స్ వేసి ఆమెనే సేవ్ చేసారు ప్రేక్షకులు. సేఫ్ అయిన తర్వాత నాగార్జున ఈ సిచ్యువేషన్ గురించి అడిగితే తనకు ఇంట్లో ఉండటం నచ్చట్లేదన్నట్లు సమాధానం చెప్పింది.

నాగార్జున గంగవ్వ (nagarjuna gangavva)
నాగార్జున గంగవ్వ (nagarjuna gangavva)

రెండు మూడు వారాల తర్వాత తానే బయటికి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చింది గంగవ్వ. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈమె. నాలుగు వారాలు పూర్తైన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉండలేనని చెప్పి బయటికి వచ్చేస్తానంటూ ఏడ్చేసింది గంగవ్వ. ఈమె నామినేషన్స్‌లోకి వెళ్లినా కూడా జనాలు ఓట్లేస్తున్నారు. ముఖ్యంగా గత వారం రోజులుగా ఈమె ఆరోగ్యం అంతగా లేకపోవడంతో బయటికి పంపేయాలనే బిగ్ బాస్ కూడా నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ తాను ఉండలేకపోతున్నాననంటూ నాగార్జున ముందే కన్నీరు పెట్టుకుంది అవ్వ. ఆమె హాస్పిటల్ రిపోర్ట్స్ చూసిన తర్వాత నాగార్జున కూడా ఇదే చెప్పాడు.

' isDesktop="true" id="628542" youtubeid="sc_99h9E-e8" category="movies">

డాక్టర్ వచ్చి పరీక్షలు చేసిన తర్వాత ఈమె ఆరోగ్యం బాగోలేదని కన్ఫర్మ్ చేసాడు. బిగ్ బాస్ ఒకవేళ మీరు ఒప్పుకుంటే గంగవ్వ బయటికి వెళ్లిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. దానికి ఆయన ఒప్పుకున్నాడు. మరోవైపు అవ్వ మాత్రం మరో రెండు మూడు వారాలు ఇంట్లో ఉండాలని ఉన్నా కూడా తన వల్ల కావడం లేదని.. అందుకే వెళ్లిపోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. దాంతో ఈ వారం దాదాపు గంగవ్వ అనూహ్యంగా బయటికి వచ్చింది.

First published:

Tags: Gangavva, Nagarjuna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు