బిగ్ బాస్ సీజన్ 4లో కొత్త టాస్క్‌లో చాలా రచ్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి గందరగోళం లేకుండా రెండు వారాలు అయిపోయాయి. కానీ మూడో వారం మాత్రం చాలా అంటే చాలా రచ్చ జరుగుతుంది. అది బిగ్ బాస్ హౌజ్లా కాదు చాపల మార్కెట్లా మారిపోయింది పరిస్థితి. ఇప్పుడు మరో విచిత్రం కూడా జరిగింది. ఇన్ని రోజులు కూల్ అండ్ కామ్‌గా కనిపించిన గంగవ్వ ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. షో మొదలైన తర్వాత తొలిసారి అవ్వ టాస్కులో పాల్గొంది. రోబోల ప్రాణాలు కాపాడటానికి మనుషులను మోసం చేసింది కూడా.
అదంతా గేమ్ ప్లాన్‌లోనే భాగంగా చేస్తూ.. ఎమోషనల్ టచ్ ఇచ్చింది గంగవ్వ. అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఒక్కసారిగా అవ్వలోని మరో మనిషి బయటికి వచ్చింది. సీరియస్ అయిపోయి కుర్చీలు కూడా విసిరేసింది. అసలు విషయం ఏంటంటే మనుషులు, రోబోల టాస్కులో చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మెహబూబ్, సోహైల్ ఓవర్ యాక్షన్ కూడా హైలైట్ అయింది. దానికితోడు అరియానా సోలో గేమ్ ప్లాన్.. గంగవ్వ, అభిజీత్ ఇంటిలిజెన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇందులో భాగంగానే మోనాల్ గజ్జర్ కూడా రోబోల టీంతో గొడవ పడింది.
అరియానాను తోసేసింది. అప్పుడే గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. ఆగు అంటూ రెచ్చిపోయింది.. అవ్వ రోబో డ్రెస్ తీసుకుని మోనాల్ లోపలికి విసరడంతో ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది గంగవ్వ. తన డ్రెస్‌తో నీకేంటి పని అంటూ మండి పడింది. అంతేకాదు పక్కనే ఉన్న కుర్చీ తీసుకుని మోనాల్ గజ్జర్పైకి విసిరేసింది. దాంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అప్పటి వరకు ఉన్న అవ్వ కాకుండా లోపలి నుంచి అమ్మోరు అవ్వ బయటికి వచ్చేసింది. ఆమెను చూసి వామ్మో ఈమెలో చాలా షేడ్స్ ఉన్నాయిరా నాయనా అంటూ నవ్వుకుంటున్నారు మిగిలిన ఇంటి సభ్యులు. ప్రస్తుతం ఈ ప్రోమో కూడా వైరల్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Telugu Cinema, Tollywood