Bigg Boss 4 Telugu | తెలుగు తెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌లో ఈ సీజన్లో అందరినీ అట్రాక్ట్ చేసిన ఒకే ఒక్క పేరు గంగవ్వ. ఈమె ఎంట్రీతో బిగ్‌బాస్ పై అంచనాలు కూడా ఓ రేంజ్లో పెరిగాయి. అంతేకాదు బిగ్‌బాస్ 4 విన్నర్‌గా ఆమె నిలుస్తారని అందరు అనుకున్నారు. హౌస్‌లో మిగతా కంటెస్టెంట్స్ ఓవైపు.. గంగవ్వ ఓ వైపు అన్నట్టుగా ప్రోగ్రామ్ సాగింది.అంతేకాదు బిగ్ బాస్ సీజన్ మొత్తానికే స్పెషల్ కంటెస్టెంట్‌గా గంగవ్వను తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆమెకు సకల సౌకర్యాలు అందచేసారు కూడా. అన్ని వసతులు కల్పించి ఇంట్లో ఉంచినా గంగవ్వకు రెండో వారం నుంచే ఇంటిపై బెంగ పెట్టుకుంది. ఆదే ఆమెను హౌస్‌లో ఉండనివ్వలేదు. అసలు ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్‌కు ఇవ్వనంత మర్యాద, గౌరవం ఇచ్చాడు. తనకు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంతేకాదు ఈ హౌస్‌లో అత్యధిక వయసున్న కంటెస్టెంట్ కూడా గంగవ్వనే. అందరు బిలో 40 లోపు ఉంటే.. ఈమె మాత్రం దాదాపు 60కి దగ్గరలో ఉంది.
నామినేషన్స్‌లో కూడా లేకుండా సొంతంగా బయటికి వచ్చేసింది గంగవ్వ. తను ఆరోగ్యం బాగోలేదని చెప్పి అభ్యర్థన పెట్టుకోవడంతో బిగ్ బాస్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున ఆమెకు సొంతంగా ఓ ఇల్లు కట్టిస్తానని హామి కూడా ఇచ్చాడు. తాజాగా గంగవ్వ బిగ్‌బాస్ హౌస్ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత హౌస్ మేట్స్ బిహేవియర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా స్టార్ మా వాళ్లు బిగ్‌బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో హౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్‌తో ఇంటర్వ్యూ చేయిస్తున్నారు. ఇందులో రాహుల్ సిప్లిగంజ్ అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు ఎంతో గడుసుగా సమాధానాలు ఇచ్చింది గంగవ్వ.
బిగ్‌బాస్ 4 హౌస్‌లో ఎవరు బాగా నవ్విస్తారు. అవినాషా.. లేకపోతే అమ్మ రాజశేఖర్ అనే ప్రశ్నకు అవినాష్ బాగా నవ్విస్తాడని చెప్పింది. మరోవైపు హౌస్‌లో అఖిల్, మోనాల్ జంట బాగుందని కితాబు ఇచ్చింది. అంతేకాదు అఖిల్‌తో ఉండటం తనకు ఎంతో ఇష్టమంటూ చెప్పింది. హౌస్‌లో సోహైల్‌కు ఉన్న కోపం ఎవరికీ లేదు అంటూ కాస్తా ఘాటుగానే సమాధానమిచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో దేత్తడి హారికకు ఉండే అర్హత లేదంటూ కామెంట్స్ చేసింది. ఆమె ఎపుడు కోపంగా తన లోకంలో తనే ఉంటుందని గంగవ్వ చెప్పింది.
హౌస్‌లో సాయి కుమార్ మాత్రమే చాలా నిజాయితీగా ఉంటాడని చెప్పింది. అఖిల్ తన కాళ్లు ఒత్తినంత మాత్రాన మంచిడోని సర్టిఫికేట్ ఇవ్వలేమని చెప్పింది. తాను ఎక్కడ ఉన్న ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతానని గంగవ్వ అన్నారు. మొత్తంగ గంగవ్వ ఉన్నన్ని రోజులు అందరి మనసతత్వాలను బాగానే స్డడీ చేసినట్టు కనబడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Dethadi harika, Gangavva, Nagarjuna Akkineni, Star Maa, Tollywood