ఈ సారి బిగ్ బాస్ సీజన్లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ. ఈ ఒక్క సీజన్ మాత్రమే కాదు అన్ని సీజన్స్‌లో ఈమె ప్రత్యేకం. ఎందుకంటే 60 ఏళ్లు దాటిన తర్వాత ఈమె షోకు వచ్చింది. అక్కడ ఉండే ఫిజికల్ టాస్కులు ఈమె చేయలేదు.. శరీరం సహకరించదు.. పైగా ఆరోగ్యం కూడా అప్పుడప్పుడూ దెబ్బ తింటుంది. అలాంటప్పుడు ఈమె టాస్కులు ఏం ఆడుతుంది.. ఖాళీగా కూర్చోవడం తప్ప అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అనవసరంగా గంగవ్వ విషయంలో బిగ్ బాస్ రిస్క్ తీసుకున్నాడంటూ నెటిజన్లు కూడా కామెంట్ చేసారు. అయితే ఎన్ని వచ్చినా కూడా నీకు మేమున్నామే గంగవ్వ అంటూ నెటిజన్లు ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు.
View this post on Instagram
రోబోట్లు గురించి కొంత తెల్సు , మా సుశిన #gangavva #myvillageshow #biggbosstelugu4 #biggboss4telugu
లక్షల్లో ఓట్లు గుద్దేస్తున్నారు. ఇప్పటికే రెండు వారాలు ఈమె నామినేషన్స్‌లోకి వచ్చి రికార్డు ఓట్లతో సేవ్ అయిపోయింది. ఇప్పుడు మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది గేమ్. అయితే మొన్నటి వరకు కామ్‌గానే ఉండి.. ఏ టాస్కులో కూడా కనిపించని గంగవ్వ ఇప్పుడు ఫిజికల్ టాస్కులు కూడా షురూ చేసింది. మీకు నేనే పోటీ అంటూ 60 ఏళ్లలో కూడా కుమ్మేస్తుంది. తన ఎనర్జీతో అందరికీ షాకిచ్చింది గంగవ్వ. తాజాగా రోబోలు, మనషులు టాస్కులో గంగవ్వ కూడా పాల్గొంది. ఆ టాస్కులో బిగ్ బాస్ చెప్పినట్లుగా రోబోల ప్రాణాలు కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేసింది ఈమె. ఆపోజిట్ టీమ్‌ను దగ్గరకు కూడా రానీకుండా కవర్ చేసింది.
View this post on Instagram
టాస్కులు కూడ అడుతున్న. #gangavva #myvillageshow #biggboss #biggbosstelugu4
గంగవ్వ జోరు చూసి కంటెస్టెంట్స్ కూడా షాక్ అయిపోయారు. ఇన్ని రోజులు ఈమె కేవలం ఖాళీగా ఉంటుందనే విమర్శలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని కూడా అధిగమించి టాస్కులు కూడా చేస్తుంది ఈమె. దాంతో మిగిలిన కంటెస్టెంట్స్ వంక పెట్టడానికి కూడా లేదు. ఇప్పట్నుంచి ఇదే జోరు చూపిస్తే గంగవ్వకు మరో 7 నుంచి 10 వారాల వరకు ఢోకా లేదు. చూడాలిక.. ఏం జరుగుతుందో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 4 Telugu, Gangavva, Telugu Cinema, Tollywood