Bigg Boss 4 Telugu: ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీనా.. ఏం చేస్తున్నారు బిగ్ బాస్..?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొదలై 50 రోజులు విజయవంతంగా గడిచిపోయింది. ఈ మధ్యే 50 రోజుల పండగ కూడా చేసుకున్నారు టీం. ఇదిలా ఉంటే ఈ షోకు రేటింగ్ విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఇంకా వెంటాడుతూనే..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 27, 2020, 2:04 PM IST
Bigg Boss 4 Telugu: ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీనా.. ఏం చేస్తున్నారు బిగ్ బాస్..?
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)
  • Share this:
బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొదలై 50 రోజులు విజయవంతంగా గడిచిపోయింది. ఈ మధ్యే 50 రోజుల పండగ కూడా చేసుకున్నారు టీం. ఇదిలా ఉంటే ఈ షోకు రేటింగ్ విషయంలో మాత్రం కొన్ని సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. లాక్‌డన్ ప్రభావంతో మొదట్లో సూపర్ రేటింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం ఊహించిన రేటింగ్ రావడం లేదు. మూడో వారం నుంచి ఐపిఎల్ పోటీకి రావడంతో బిగ్ బాస్‌ రేటింగ్‌కు బాగానే గండి పడింది. దాంతో టీఆర్పీ కోసం నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఇప్పిస్తున్నారు. ఇప్పటికే 4వ సీజన్‌లో ముగ్గురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అందులో స్వాతి దీక్షిత్ వారం రోజులకే ఇంటి ముఖం పట్టింది.. మరోవైపు కుమార్ సాయి కూడా రెండు వారాలకే ఇంటికి చేరిపోయాడు. అవినాష్ మాత్రమే స్ట్రాంగ్‌గా ఉన్నాడు ఇంట్లో. ఇప్పుడు మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది.
bigg boss 4 telugu,bigg boss 4 telugu mangli,bigg boss 4 telugu mangli 4th wild card,bigg boss telugu season 4,bigg boss 4 telugu contestants,bigg boss 4 contestants,bigg boss 4 telugu 8th week nominations,bigg boss 4 telugu wild card entry singer mangli,bigg boss 4 telugu wild card entry folk singer mangli,మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగులో మంగ్లీ ఎంట్రీ
జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash)


షో మొదలైన 50 రోజులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి బాసూ.. ఎలాగూ విన్నర్ అయ్యే అవకాశమే లేదు కదా.. ఏదో కామెడీ కోసం కాకపోతే అనుకుంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీకెండ్స్ రేటింగ్స్ బాగానే వస్తున్నా.. వీక్ డేస్ మాత్రం బాగా వీక్ అయిపోతున్నాయి. అందుకే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పించి ఇంట్లో జోష్ పెంచాలని చూస్తున్నారు. అందుకే ఫోక్ సింగర్ కమ్ యాంకర్ మంగ్లీని ఒప్పించి వైల్డ్ కార్డ్ ఇచ్చి పంపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ షో కోసం ఆమెకు భారీ పారితోషికం కూడా ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా మంగ్లీ క్వారెంటైన్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి.
bigg boss 4 telugu,bigg boss 4 telugu mangli,bigg boss 4 telugu mangli 4th wild card,bigg boss telugu season 4,bigg boss 4 telugu contestants,bigg boss 4 contestants,bigg boss 4 telugu 8th week nominations,bigg boss 4 telugu wild card entry singer mangli,bigg boss 4 telugu wild card entry folk singer mangli,మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ,బిగ్ బాస్ 4 తెలుగు,బిగ్ బాస్ 4 తెలుగులో మంగ్లీ ఎంట్రీ
సింగర్ మంగ్లీ (Singer Mangli)

ఏదేమైనా కూడా ఏడు వారాలు ముగిసిపోయి.. 8వ వారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న సభ్యులు కూడా దీనికి ఏ మాత్రం అడ్జస్ట్ కాలేరేమో..? ఎందుకంటే 10 రోజుల తర్వాత వచ్చిన అవినాష్‌కే వాళ్లు పేరు పెట్టారు.. స్వాతి దీక్షిత్, కుమార్ సాయి ఎలిమినేషన్‌కు కారణం కూడా వాళ్ల వైల్డ్ కార్డే. ఇలాంటి పరిస్థితుల్లో హౌజ్‌లోకి మంగ్లీ వచ్చి ఏ మాయ చేస్తుందో..? మంగ్లీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమెను ఆటలో జొప్పించడం బాగానే ఉన్నా ఇన్ని వారాల తర్వాత ఆమెను పంపించి మాత్రం ఏం ప్రయోజనం అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: October 27, 2020, 2:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading