Home /News /movies /

BIGG BOSS 4 TELUGU FINALE EPISODE NAGARJUNA STRONG WARNING TO SWATHI DEEKSHITH IN RAM GOPAL VARMA ISSUE PK

Nagarjuna RGV: వర్మతో జర జాగ్రత్త.. ఆ హీరోయిన్‌కు నాగార్జున వార్నింగ్..

నాగార్జున వర్మ (Nagarjuna RGV)

నాగార్జున వర్మ (Nagarjuna RGV)

Nagarjuna RGV: నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4తో బిజీగా ఉన్నాడు. మరికొన్ని గంటల్లోనే ఈ సీజన్ అయిపోతుంది. డిసెంబర్ 20న భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయింది.

నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 4తో బిజీగా ఉన్నాడు. మరికొన్ని గంటల్లోనే ఈ సీజన్ అయిపోతుంది. డిసెంబర్ 20న భారీగానే ఏర్పాట్లు కూడా చేసారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇక విన్నర్ ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫినాలేకు అంతా వచ్చారు. ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అంతా మళ్లీ స్టేజీపై కనిపించారు.. ఆడి పాడారు కూడా. అందరూ వచ్చేసరికి మళ్లీ స్టేజీ అంతా కళకళలాడిపోయింది. బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్లిపోయిన తర్వాత ఎవరేం చేస్తున్నారు అంటూ అందర్నీ అడిగాడు నాగార్జున. అందులో భాగంగానే కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్‌ను కూడా అడిగాడు. అప్పుడు ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత బయట బాగానే గుర్తింపు వచ్చిందని.. ప్రస్తుతం ఆర్జీవీతో సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఒకే ఒక్క వారం ఇంట్లో ఉన్న ఈమె వెంటనే ఎలిమినేట్ అయిపోయింది. 8 రోజుల్లోనే ఈమె బిగ్ బాస్ ప్రయాణం ముగిసిపోయింది. దాంతో స్వాతి విషయంలో అప్పుడు నోయల్, అమ్మ రాజశేఖర్ మధ్య గొడవ కూడా జరిగింది. ఇదంతా గతం.. ఇప్పుడు అంతా మరిచిపోయారు.
nagarjuna rgv,nagarjuna warning to swathi deekshith,bigg boss 4 telugu,bigg boss 4 telugu winner,bigg boss telugu 4 promo,bigg boss 4 telugu grand finale promo,bigg boss 4 telugu grand finale,bigg boss 4 telugu voting results,bb4 telugu grand finale promo,bigg boss telugu 4 grand finale,bigg boss 4 winner abhijeet,స్వాతి దీక్షిత్ వర్మ సినిమా,నాగార్జున స్వాతి దీక్షిత్,బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే
నాగార్జున వర్మ (Nagarjuna RGV)

ఇదిలా ఉంటే బయటికి వచ్చిన తర్వాత వర్మతో సినిమా అనగానే నాగార్జున ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. ఆర్జీవీతో జాగ్రత్త అంటూ చెప్పాడు. ఎందుకంటే ఆర్జీవీ గురించి నాగార్జునకు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో..? ఆయన్ని దర్శకుడిగా పరిచయం చేసిందే నాగార్జున. శివతో అప్పట్లో ఇండియన్ సినిమాను మార్చేసారు ఈ ఇద్దరూ. వర్మ పిచ్చిగా పెట్టే మెసేజ్‌లు ఎంత మందు తాగి పెడతాడనేది కూడా చెప్పగలడు నాగార్జున. అంత బాగా ఆయన్ని స్టడీ చేసాడు.
nagarjuna rgv,nagarjuna warning to swathi deekshith,bigg boss 4 telugu,bigg boss 4 telugu winner,bigg boss telugu 4 promo,bigg boss 4 telugu grand finale promo,bigg boss 4 telugu grand finale,bigg boss 4 telugu voting results,bb4 telugu grand finale promo,bigg boss telugu 4 grand finale,bigg boss 4 winner abhijeet,స్వాతి దీక్షిత్ వర్మ సినిమా,నాగార్జున స్వాతి దీక్షిత్,బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలే
స్వాతి దీక్షిత్ (Swathi Deekshith)

ఇదిలా ఉంటే శివ తర్వాత గోవిందా గోవిందా, ఆఫీసర్ సినిమాలు దారణంగా నిరాశ పరిచాయి. అందుకే వర్మకు మరో ఆఫర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నాడు నాగార్జున. ఇలాంటి సమయంలో స్వాతి ఆయనతో సినిమా చేస్తుందనగానే నాగార్జున ఇలా వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Nagarjuna, RGV, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు