Home /News /movies /

BIGG BOSS 4 TELUGU ENDING WILL BE IN NEXT LEVEL AND MAKERS PLANNING IT VERY BIG MANNER PK

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 ఎండింగ్ ఎలా ఉండబోతుందో తెలుసా.. ఆ మూడు రోజులు రచ్చే..

బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)

బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)

Bigg Boss 4 Telugu: 105 రోజుల పాటు సాగిన షోను అంత ఈజీగా ఎలా ముగిస్తారు..? ప్రేక్షకులు ఎంతగా ఊహించుకుంటే అంతకంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు నిర్వాహకులు. ఆడియన్స్ అంచనాలకు మించి ఈ షో ముగింపు ఉండాలని సన్నాహాలు..

105 రోజుల పాటు సాగిన షోను అంత ఈజీగా ఎలా ముగిస్తారు..? ప్రేక్షకులు ఎంతగా ఊహించుకుంటే అంతకంటే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు నిర్వాహకులు. ఆడియన్స్ అంచనాలకు మించి ఈ షో ముగింపు ఉండాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్నీ వేగంగా జరుగుతున్నాయి. గ్రాండ్ ఫినాలెకి మూడు రోజులు ముందు నుంచి అసలు రచ్చ మొదలుకానుంది. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అంటే డిసెంబర్ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ వారం మొదట్లోనే పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ను ఇంట్లోకి పంపించి వాళ్లతో మాట్లాడించారు. ఇక గత సీజన్‌లో చేసినట్లే ఈ సారి కూడా ఇఫ్పుడు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అందర్నీ రీ యూనియన్ కోసం పిలవనున్నట్లు తెలుస్తుంది. అందర్నీ మళ్లీ కలిపించి పార్టీలా చేయబోతున్నారని.. దాని వల్ల రేటింగ్ కూడా భారీగా వస్తుందని ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. అయితే వాళ్లు అనుకున్నది ఎంతవరకు సాధ్యమవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ 4 ఫైనలిస్టులు (Bigg Boss 4 Telugu Finalists)

ఎందుకంటే ఇప్పుడు బయట కరోనా నడుస్తుంది. ఇలాంటి సమయంలో అందర్నీ ఇంట్లోకి పంపడం అంటే చిన్న విషయం కాదు. అందరికీ టెస్టులు చేసి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తే కానీ పంపలేని పరిస్థితి. అందుకే ఇది అయ్యేవరకు కూడా అనుమానమే. కానీ ఫినాలే ఎపిసోడ్ మాత్రం కచ్చితంగా అందరూ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. వాళ్లతో స్కిట్స్‌తో పాటు డాన్సులు కూడా చేయించబోతున్నారు. గత సీజన్స్‌లో కూడా ఇలాగే చేసారు. ఇప్పుడు ఇదే రిపీట్ చేయబోతున్నారు.
బిగ్ బాస్ 4 తెలుగు (Bigg Boss 4 Telugu)

అంతేకాదు ఫినాలే ఎపిసోడ్ కోసం మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లలో ఒకరు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా చివరి మూడు రోజులు మాత్రం మామూలు రచ్చ ఉండకూడదని ప్లాన్ చేస్తున్నారు. అది వర్కవుట్ అయితే టీఆర్పీ రేటింగ్ కూడా రికార్డ్స్ క్రియేట్ ఖాయం. ఆలోచనల వరకు అంతా బాగానే ఉంది కానీ అనుకున్నది అనుకున్నట్లు అయితే మాత్రం అరాచకమే. చూడాలిక బిగ్ బాస్ చివరి వారం చివరి అంకంలో ఏం జరగబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Bigg Boss 4 Telugu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు