Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు బ్యూటీ దివి జీవితంలో విషాద ప్రేమకథ తెలుసా..?

Bigg Boss 4 Divi Vadthya: ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 4లో మాత్రం కలరింగ్ అదిరిపోయింది. అసలు ఇంట్లో ఈ సారి అమ్మాయిలు ఉన్నారు చూడండి.. అదుర్స్ అంతే. ఎవర్ని చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటున్నారు నెటిజన్లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 24, 2020, 7:39 PM IST
Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 తెలుగు బ్యూటీ దివి జీవితంలో విషాద ప్రేమకథ తెలుసా..?
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి వాద్త్యా హాట్ ఫోటోషూట్ (Divi Vadthya/Instagram)
  • Share this:
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. బిగ్ బాస్ సీజన్ 4లో మాత్రం కలరింగ్ అదిరిపోయింది. అసలు ఇంట్లో ఈ సారి అమ్మాయిలు ఉన్నారు చూడండి.. అదుర్స్ అంతే. ఎవర్ని చూడాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటున్నారు నెటిజన్లు. అంత అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి బిగ్ బాస్ హౌజ్‌లో కూర్చోబెట్టారు. వాళ్లంతా నానా హంగామా చేస్తున్నారు. వాళ్లందరిలో కూడా దివి చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. తొలివారం చాలా కామ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయింది. మెల్లగా తనలోని మరో మనిషిని బయటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో దివి కూడా ఉంది.
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)


ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి. ఈ షో తర్వాత ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోనుంది. పైగా అవకాశాలు కూడా వచ్చేలా కనిపిస్తున్నాయి. గతంలోనే ఈమె మహేష్ బాబు 'మహర్షి' చిత్రంలో నటించింది. ఆ విషయం తెలియగానే అంతా ఆమె కోసం చూసారు.. పైగా మహేష్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఈమెకు కనిపిస్తుంది. అయితే ఇంత సైలెంట్‌గా కనిపించే ఈమె జీవితంలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉంది. గతంలో ఈమె ఒక అబ్బాయిని ప్రేమించింది.. కొన్నాళ్ల పాటు అతడితో రిలేషన్ షిప్‌లో కూడా ఉంది.
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)

ఈ విషయం తనే స్వయంగా చెప్పింది. అయితే కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయిపోయింది. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చింది దివి. బ్రేకప్ తర్వాత తన లైఫ్‌లో ఎవరు లేరని.. సింగిల్‌గా ఉండటమే బాగుందని చెప్పింది. నిజానికి ఇలా ఉంటేనే మనకు నచ్చినట్లు ఉంటామని.. ఎలా కావాలంటే అలా బతుకుతామని చెప్తుంది దివి. అందుకే ఇలా ఉండటమే మంచిదని ఫిక్సైపోయినట్లు చెప్పింది దివి. తాను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్‌గానే ఉన్నానని తెలిపింది ఈమె.
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)

కానీ ఇద్దరి మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నామని తన జీవితంలోని ప్రేమకథ గురించి చెప్పింది దివి. అలాగని అతడు చెడ్డవాడు కాదని.. చాలా మంచి వ్యక్తి అంటుంది దివి. కాకపోతే అతని కుటుంబంలో చిన్న సమస్య రావడంతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందంటుంది దివి. ఇప్పటికీ అతనిపై తనకు మంచి అభిప్రాయమే ఉందని.. అతడు చాలా మంచి అబ్బాయి అంటుంది. కాకపోతే అతడి తమ్ముడు చనిపోవడంతో ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. అప్పుడు తనను పెళ్లి చేసుకుని పళ్లెటూరుకు వచ్చేయాలంటూ కోరాడని చెప్పింది.
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)
బిగ్ బాస్ 4 బ్యూటీ దివి (Divi Vadthya/Instagram)

కానీ చిన్నప్పటి నుంచీ హైదరాబాద్‌లోనే పెరగడం వల్ల పల్లెటూరు తనకు అలవాటు లేదని చెప్పింది. ఒకవేళ నిజంగానే అక్కడికి వెళ్లేదాన్నేమో కానీ తనకు ఇష్టమైన మోడలింగ్, మానేయాలంటూ కోరాడని.. అది నచ్చక అతన్నే వదిలేసానని చెప్పింది దివి. మొత్తానికి అలా తన జీవితంలో ఓ ప్రేమకథ ఉందని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది దివి వ్యాద్త్యా.
Published by: Praveen Kumar Vadla
First published: September 24, 2020, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading