Bigg Boss Divi Love Story: బిగ్ బాస్ బ్యూటీ దివి ప్రేమకథ.. ఆ అబ్బాయి ఎవరో తెలిసిపోయింది..

Bigg Boss Divi Love Story: బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ.. ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 27, 2020, 6:47 AM IST
Bigg Boss Divi Love Story: బిగ్ బాస్ బ్యూటీ దివి ప్రేమకథ.. ఆ అబ్బాయి ఎవరో తెలిసిపోయింది..
దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)
  • Share this:
బిగ్ బాస్ 4 తర్వాత దివికి అనూహ్యమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈమె ఎలిమినేట్ అయినా కూడా సోషల్ మీడియాలో అమ్మడికి అంతా ఫిదా అయిపోయారు. ముక్కుసూటిగా ఉంటూ.. ఉన్నదున్నట్లు చెప్తూ 50 రోజుల పాటు గేమ్ ఆడి గతవారమే ఎలిమినేట్ అయిపోయింది దివి. హౌజ్‌లో మిగిలిన అమ్మాయిలున్నా కూడా దివి మాత్రం అందరి కంటే ఎక్కువగానే ఆకట్టుకుంది. అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బిగ్ బాస్ హౌజ్‌లో కూర్చోబెట్టారు. తొలివారం చాలా కామ్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయింది. మెల్లగా తనలోని మరో మనిషిని బయటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం దివి ప్రేమకథ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వినిపిస్తున్నాయి. ఈమె అందాల వలకు కుర్రళ్ల మతులు చెడిపోతున్నాయి. గతంలోనే ఈమె మహేష్ బాబు 'మహర్షి' చిత్రంలో నటించింది. ఆ విషయం తెలియగానే అంతా ఆమె కోసం చూసారు. అయితే ఇంత సైలెంట్‌గా కనిపించే ఈమె జీవితంలో ఓ బ్రేకప్ స్టోరీ కూడా ఉంది. గతంలో ఈమె ఒక అబ్బాయిని ప్రేమించింది.. కొన్నాళ్ల పాటు అతడితో రిలేషన్ షిప్‌లో కూడా ఉంది.

దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)
దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)


ఈ విషయం తనే స్వయంగా చెప్పింది. అయితే కొన్ని రోజుల తర్వాత బ్రేకప్ అయిపోయింది. దానికి కారణాలు కూడా చెప్పుకొచ్చింది దివి. బ్రేకప్ తర్వాత తన లైఫ్‌లో ఎవరు లేరని.. సింగిల్‌గా ఉండటమే బాగుందని చెప్పింది. నిజానికి ఇలా ఉంటేనే మనకు నచ్చినట్లు ఉంటామని.. ఎలా కావాలంటే అలా బతుకుతామని చెప్తుంది దివి. అందుకే ఇలా ఉండటమే మంచిదని ఫిక్సైపోయినట్లు చెప్పింది దివి. తాను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్‌గానే ఉన్నానని తెలిపింది ఈమె. దివి ప్రేమకథ గురించి వాళ్ల పేరెంట్స్ కూడా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. శశికాంత్, దేవిక వైద్య వాళ్ల కొడుకునే దివి ప్రేమించిందని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నట్లు తెలిపారు దివి తల్లిదండ్రులు.

దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)
దివి వాద్త్యా (Divi Vadthya/ Instagram)


కానీ ఇద్దరి మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారని.. తమ కూతురు జీవితంలోని ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు వాళ్లు. అలాగని అతడు చెడ్డవాడు కాదని.. చాలా మంచి వ్యక్తి అంటుంది దివి. కాకపోతే అతని కుటుంబంలో చిన్న సమస్య రావడంతో బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చిందంటుంది దివి కూడా. ఇప్పటికీ అతనిపై తనకు మంచి అభిప్రాయమే ఉందని.. అతడు చాలా మంచి అబ్బాయి అంటుంది. కాకపోతే అతడి తమ్ముడు చనిపోవడంతో ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. అప్పుడు తనను పెళ్లి చేసుకుని పళ్లెటూరుకు వచ్చేయాలంటూ కోరాడని చెప్పింది.

బిగ్ బాస్ 4 బ్యూటీ దివి వాద్త్యా హాట్ ఫోటోషూట్ (Divi Vadthya/Instagram)


కానీ చిన్నప్పటి నుంచీ హైదరాబాద్‌లోనే పెరగడం వల్ల పల్లెటూరు తనకు అలవాటు లేదని చెప్పింది. ఒకవేళ నిజంగానే అక్కడికి వెళ్లేదాన్నేమో కానీ తనకు ఇష్టమైన మోడలింగ్, మానేయాలంటూ కోరాడని.. అది నచ్చక అతన్నే వదిలేసానని చెప్పింది దివి. ఇదే విషయాన్ని ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివి పేరెంట్స్ కూడా చెప్పారు. పరిస్థితుల ప్రభావంతోనే దివి ప్రేమ విఫలమైంది కానీ అభిప్రాయ బేధాలతో కాదని వాళ్లు క్లారిటీ ఇచ్చారు.
Published by: Praveen Kumar Vadla
First published: October 27, 2020, 6:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading